AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..

నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజిన్లతో రంగంలోకి దిగారు. ముందుగా అక్కడ్నుంచి జనాలను క్షేమంగా తరలించారు. అయితే అప్పటికి అయోధ్య ధామ్‌లోని లవకుష్ ఆశ్రమం పూర్తిగా కాలి బూడిదైపోయింది. సాయంత్రం 5.45 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఫైర్‌ సిబ్బంది వచ్చే లోగా, అప్పటికి రెండు టెంట్లు కాలిపోయాయి. మంటల కారణంగా అక్కడ ముందుగానే ఉంచిన భద్రతా సిబ్బందికి అవసరమైన వస్తువులు కూడా కాలిపోయాయి.

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..
Mahakumbh Mela Fire
Jyothi Gadda
|

Updated on: Feb 17, 2025 | 5:22 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో మరోసారి అగ్నిప్రమాదం భయాందోళనలు సృష్టించింది. మహాకుంభ్ ప్రాంతంలోని పలు చోట్ల మంటలు చెలరేగాయి. సెక్టార్ 18, 19 మధ్య ఉన్న అనేక మండపాలు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకున్నాయి. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతున్నారు. మంటలను పూర్తిగా అదుపు చేశామని పరిపాలన వర్గాలు చెబుతున్నాయి. కల్పవాసీలు ఖాళీ చేసిన కొన్ని పాత గుడారాలలో మంటలు చెలరేగాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సమాచారం ప్రకారం, మహా కుంభమేళా సందర్భంగా సెక్టార్ 19లోని మోరి మార్గ్‌లో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజిన్లతో రంగంలోకి దిగారు. ముందుగా అక్కడ్నుంచి జనాలను క్షేమంగా తరలించారు. అయితే అప్పటికి అయోధ్య ధామ్‌లోని లవకుష్ ఆశ్రమం పూర్తిగా కాలి బూడిదైపోయింది. సాయంత్రం 5.45 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఫైర్‌ సిబ్బంది వచ్చే లోగా, అప్పటికి రెండు టెంట్లు కాలిపోయాయి. మంటల కారణంగా అక్కడ ముందుగానే ఉంచిన భద్రతా సిబ్బందికి అవసరమైన వస్తువులు కూడా కాలిపోయాయి.

ఈ సంఘటన తర్వాత, సెక్టార్ 18లోని హరిశ్చంద్ర మార్గ్‌లో ఉన్న గణేష్ ధామ్ ఉజ్జయిని ఆశ్రమం బాబా త్రిలోచన్ దాస్ ఖాళీగా ఉన్న టెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. కానీ అప్పటికే రెండు టెంట్లు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పోలీస్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగిందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ శర్మ తెలిపారు. సాధువు శిబిరంలో అగ్నిప్రమాదానికి కారణం తెలియరాలేదని చెప్పారు. జరిగిన ప్రమాదంలో ఆస్తినష్టం మినహా ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, మహా కుంభమేళా30 రోజుల్లో జరిగిన అగ్నిప్రమాదాలు..

– 2025 జనవరి 19న మొదటిసారి అగ్నిప్రమాదం జరిగింది. గీతా ప్రెస్ క్యాంప్ అగ్నిప్రమాదానికి గురైంది. జరిగిన అగ్నిప్రమాదంలో 150కు పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయి.

– 2025 జనవరి 30న ఛత్నాగ్ ఘాట్ వద్ద టెంట్ సిటీలో మంటలు చెలరేగి, దాదాపు పది టెంట్లు దగ్ధమయ్యాయి.

– 2025 ఫిబ్రవరి 7వ తేదీన శంకరాచార్య మార్గ్‌ లోని సెక్టార్‌ 18లో మంటలు చెలరేగాయి.

– 2025 ఫిబ్రవరి13 తేదీన కూడా మహాకుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది.

– 2025 ఫిబ్రవరి 15న సెక్టార్ 18లో అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఆయా ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

– 2025 ఫిబ్రవరి 17న, సెక్టార్ 8లో రెండు చోట్ల మంటలు చెలరేగాయి. సెక్టార్ 18లోని బజరంగ్‌దాస్ మార్గ్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..

ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?

ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్‌ చేసేయండిలా..

ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..