AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మినీ బస్సుగా మారిన ఆటో..! ఏకంగా 18 మందిని ఎక్కించిన డ్రైవర్‌.. ఎలాగో మీరే చూడండి..

ఓవర్‌లోడ్ తో ప్రయాణిస్తున్న ఆటోను పోలీసులు అడ్డుకున్నారు. అందులో 18 మంది ప్రయాణికులను చూసి ఇన్‌స్పెక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. అంత మంది ప్రయాణీకులను ఎలా కూర్చోబెట్టగలిగారంటూ డ్రైవర్‌ను అడిగినప్పుడు, డ్రైవర్ వారిని మళ్ళీ కూర్చోబెట్టి చూపించాడు..ప్రజల్ని పశువుల మాదిరిగా కుక్కి ఆటోలో నింపాడు. పైగా ఇదంతా తమకు అలవాటైన పని అంటున్నాడు సదరు ఆటో డ్రైవర్‌. రోజూ ఇలాగే ప్రయాణికుల్ని తరలిస్తుంటామని చెప్పాడు..

Viral Video: మినీ బస్సుగా మారిన ఆటో..! ఏకంగా 18 మందిని ఎక్కించిన డ్రైవర్‌.. ఎలాగో మీరే చూడండి..
18 Passengers In Auto
Jyothi Gadda
|

Updated on: Feb 17, 2025 | 6:25 PM

Share

ఆటో అంటే పేదల కార్‌ అని అంటారు.. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆటోలో ప్రయాణించే ఉంటారు.. అయితే, కొన్ని ప్రాంతాల్లో షేర్‌ ఆటోలు ఎక్కువగా నడుస్తుంటాయి. ముఖ్యంగా గ్రామాలు, మారమూల పల్లెల్లో ఇలాంటి షేర్‌ ఆటోలు ఎక్కువగా తిరుగుతుంటాయి. బస్సు సౌకర్యం అందుబాటులో లేకపోడంతో ప్రజలు ఎక్కువ వరకు ఆటోలోనే ప్రయాణిస్తుంటారు. ఇదే అదునుగా కొందరు ఆటోవాలాలు కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేయడం లేదంటే… ఒకే ట్రిప్పులో ఎక్కువ మంది జనాల్ని ఆటోలో కుక్కించి ఎక్కిస్తుంటారు..అచ్చం ఇలాంటి పని చేసిన ఓ ఆటో డ్రైవర్‌ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో ఆటో డ్రైవర్లు సీట్లు సరిపోయే దానికంటే ఎక్కువ మంది ప్రయాణీకులను కూర్చోబెడుతుంటారు. ప్రయాణీకులు కూడా త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆరాటంతో సర్దుబాటు చేసుకుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుండి ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ప్రయాణీకుల సీటింగ్ అన్ని పరిమితులను దాటి తన ఆటోను మినీ బస్సులా మార్చాడు. తన ఆటోలో ఏకంగా 18 మంది ప్రయాణికులను తీసుకెళ్లాడు. నెట్టింట ఈ వీడియో సంచలనంగా మారింది.

దీంతో ఓవర్‌లోడ్ తో ప్రయాణిస్తున్న ఆటోను పోలీసులు అడ్డుకున్నారు. అందులో 18 మంది ప్రయాణికులను చూసి ఇన్‌స్పెక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. అంత మంది ప్రయాణీకులను ఎలా కూర్చోబెట్టగలిగారంటూ డ్రైవర్‌ను అడిగినప్పుడు, డ్రైవర్ వారిని మళ్ళీ కూర్చోబెట్టి చూపించాడు..ప్రజల్ని పశువుల మాదిరిగా కుక్కి ఆటోలో నింపాడు. పైగా ఇదంతా తమకు అలవాటైన పని అంటున్నాడు సదరు ఆటో డ్రైవర్‌. రోజూ ఇలాగే ప్రయాణికుల్ని తరలిస్తుంటామని చెప్పాడు.. దాంతో ఇన్స్పెక్టర్ ప్రయాణీకులందరినీ ఆటో నుండి కిందకి దించాడు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్‌ చేశాడు..

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ సంఘటన ఆదివారం రాత్రి ఝాన్సీలోని బారుసాగర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. అందరూ వివాహ వేడుక నుండి ఆటోలో తిరిగి వస్తున్నారని తెలిసింది. రాజ్‌గఢ్ నివాసి అయిన రూప్ సింగ్ యాదవ్ ఆటో నడుపుతాడని పోలీసులు తెలిపారు. భెల్సా గ్రామానికి చెందిన 18 మంది శనివారం ఒక పెళ్లిలో పని చేయడానికి ఝాన్సీకి వచ్చారు. పెళ్లి తర్వాత, అందరినీ ఆటోలో ఇంటికి తీసుకెళ్లే బాధ్యతను రూప్ సింగ్ తీసుకున్నాడు. రాత్రి 1:30 ప్రాంతంలో అందరూ పెళ్లి పనులు ముగించుకుని వచ్చేసరికి రూప్ సింగ్ ఒక ఆటోతో వచ్చి 18 మందిని అదే ఆటోలో కూర్చోబెట్టాడు. రూప్ సింగ్ సహా మొత్తం 19 మంది ఆటోలో ప్రయాణిస్తుండగా, ఆటోను సీజ్ చేసినట్లు CO అజయ్ కుమార్ తెలిపారు.

ఇది కూడా చదవండి: వీళ్ల రీల్స్‌ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్‌ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్‌ పేలటంతో..

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..

ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?

ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్‌ చేసేయండిలా..

ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..