AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బర్డ్‌ఫ్ల్యూ భయమే లేదు.! ట్రక్‌ డ్రైవర్‌ నిద్రమత్తుతో ఊరు ఊరంతా చికెన్‌ పండగ చేసుకుంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఒక ట్రక్ డ్రైవర్ కు నిద్రలేమి కారణంగా ఒక ఊరు ఊరంతా చికెన్‌ పండగ జరుపుకుంది..అవును మీరు విన్నది నిజమే.. కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఒక ట్రక్కు డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ఒక్కసారిగా అది బోల్తా పడింది. దాంతో చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆ ట్రక్కునంతా ఖాళీ చేశారు..దొరికిన వారికి దొరికన్నీ కోళ్లను పట్టుకుని ఇళ్లకు వెళ్లి పండగ చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బర్డ్‌ఫ్ల్యూ భయమే లేదు.! ట్రక్‌ డ్రైవర్‌ నిద్రమత్తుతో ఊరు ఊరంతా చికెన్‌ పండగ చేసుకుంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Chicken Loot
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2025 | 1:35 PM

Share

ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల, అమేథి నుండి ఫిరోజాబాద్ కు కోళ్లను తీసుకెళ్తున్న పికప్ ట్రక్ కన్నౌజ్ ఎక్స్‌ప్రెస్‌వేపై కనిపించింది. అకస్మాత్తుగా ఈ ట్రక్కు బోల్తా పడింది. అమేథి నుండి ఫిరోజాబాద్ కు కోళ్లను తీసుకెళ్తున్న పికప్ ట్రక్ కన్నౌజ్ ఎక్స్‌ప్రెస్‌వేపై బోల్తా పడింది. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ట్రక్కు అదుపు తప్పినట్టుగా తెలిసింది. ఈ ట్రక్కు కోళ్లతో నిండి ఉంది.

ట్రక్కు బోల్తా పడగానే, ఈ కోళ్లన్నీ బయటకు వచ్చాయి. ఒక్క క్షణంలో గ్రామం మొత్తం అక్కడకు చేరుకుంది. చేతికి దొరికినన్నీ కోళ్లను పట్టుకెళ్లి విందు చేసుకున్నారు. పోలీసులు, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (UPEIDA) సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని జనాలను చెదరగొట్టారు. గాయపడిన ట్రక్‌ డ్రైవర్‌ని ఆసుపత్రిలో చేర్పించినట్టుగా తెలిసింది. కాగా, దీని వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో IANS x హ్యాండిల్‌లో షేర్ చేయబడింది. దీనిలో ఒకే చోట చాలా కోళ్లు పడిపోయి ఉండటం, వాటి చుట్టూ జనం గుమిగూడి ఉండటం కనిపించింది. అలాగే, ప్రజల చేతుల్లో కోళ్లు కనిపిస్తున్నాయి. కానీ, వీడియోలో ట్రక్కు కనిపించడం లేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…