అత్త మామలు కాదు నరరూప రాక్షసులు.. అడిగిన కట్నం ఇవ్వలేదని కోడలికి HIV ఇంజక్షన్..
దాంతో ఆ యువతి ఆరోగ్య పరిస్థితి క్షిణించింది. దాంతో బాధితురాలు తన తండ్రితో కలిసి పోలీసులను ఆశ్రయించారు. తన భర్త, బావమరిది, అత్తగారు, వదిన పేర్లను పేర్కొంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన భర్త, బావమరిది, అత్త, వదిన పేర్లను పేర్కొంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భారత న్యాయ స్మృతి, వరకట్న చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

వివాహం అనేది ప్రతి ఒక్కరి కల. వివాహం తర్వాత ప్రతి ఒక్కరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వారి కలలు, ఆశలు అన్ని కలగలుపుకోని కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుంటారు… కానీ అదే పెళ్లి ఓ యువతి ప్రాణాల మీదకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ విషయంలో ఇలాంటిదే జరిగింది. కొత్తగా పెళ్లైన ఓ యువతి అత్తమామలు కట్నం డిమాండ్ తీర్చకపోవడంతో ఆమెకు హెచ్‌ఐవి సోకిన ఇంజక్షన్ ఇచ్చారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. విషయం వెలుగులోకి రావడంతో వార్త సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై తీవ్ర ఆగ్రహంతో స్పందించారు.
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఇలాంటి షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అడిగిన కట్నం ఇవ్వలేదనే కోపంతో యువతి భర్త తన భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చారు. దాంతో ఆ యువతి ఆరోగ్య పరిస్థితి క్షిణించింది. దాంతో బాధితురాలు తన తండ్రితో కలిసి పోలీసులను ఆశ్రయించారు. తన భర్త, బావమరిది, అత్తగారు, వదిన పేర్లను పేర్కొంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన భర్త, బావమరిది, అత్త, వదిన పేర్లను పేర్కొంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భారత న్యాయ స్మృతి, వరకట్న చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు…తన కుమార్తెను ఫిబ్రవరి 2023లో పూర్తి ఆచారాలతో వివాహం జరిపించినట్టుగా చెప్పారు. ఈ పెళ్లికి దాదాపు 45 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని చెప్పారు. వరుడికి కట్నంగా సబ్-కాంపాక్ట్ SUV, రూ.15 లక్షల నగదు ఇచ్చినట్టుగా చెప్పారు. కానీ, ఆ తరువాత కూడా అత్తమామలు రూ. 10 లక్షల నగదు, ఒక పెద్ద SUV ని డిమాండ్ చేయడం ప్రారంభించారని ఆరోపించారు. ఇవే కోరికలతో తమ కూతుర్ని వేధించడం ప్రారంభించారని చెప్పారు.. పెళ్లి జరిగిన నెల రోజులకే 25 మార్చి 2023న తమ కూతుర్ని వేధించి, ఇంటి నుండి వెళ్లగొట్టారని చెప్పారు. కానీ, పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్ణయంతో ఆమెను తిరిగి ఆమె అత్తమామల ఇంటికి పంపించారు. కానీ, వాళ్ల వరకట్న దాహం తీరలేదని వాపోయారు. తమ కోరికలు తీర్చకపోవటంతో తన కూతురికి HIV సోకిన ఇంజెక్షన్ ఇచ్చారంటూ బాధితురాలు, ఆమె తండ్రి విలపిస్తూ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




