AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ginger: ప్రతిరోజూ అల్లం తింటే.. ఆ రోగాలు ఫసక్.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..!

ప్రతి రోజూ మనం వంటలో వాడే అల్లం వంటకాలకు మంచి రుచిని అందిస్తుంది. అయితే, అల్లం వంటలకు కేవలం మంచి రుచిని ఇవ్వడమే కాదు.. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు అల్లంతో చెక్‌ పెట్టొచ్చునని వివరిస్తున్నారు. అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Feb 16, 2025 | 10:24 AM

Share
ఆకలిని పెంచడంలో అల్లం బాగా సహాయ పడుతుంది. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాన్సర్ బాధితులకు ఆకలి తగ్గిపోతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కొన్నిసార్లు ఆకలిగా అనిపించదు. అలాంటివారికి నీళ్లల్లో నిమ్మరసం, అల్లం కలిపి ఇవ్వడం వల్ల ఆకలి పెరుగుతుంది.

1 / 5
మిరియాలు, వెల్లుల్లి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ఈ మూడు వస్తువులను మీ వంటలో చేర్చుకోవడం వల్ల గ్యాస్ట్రిటిస్ సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

2 / 5
అల్లం జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుందే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3 / 5
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తినడం లేదా అల్లం నీరు తాగడం శరీర డిటాక్స్‌కు సహాయపడుతుంది. ఒక నెలపాటు ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అల్లంలోని పదార్థాల వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్‌ల పరిమాణం తగ్గుతుంది.

4 / 5
అల్లం రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేసి, జుట్టును బలంగా, ఒత్తుగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఈ సహజ ఔషధాన్ని మీ రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం మంచిది.

5 / 5