AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?

మీరు ఎప్పుడైనా ఆలోచించారా..కార్పొరేట్ షాపింగ్ మాల్‌లో బంగారం కొనడం మంచిదా లేక చిన్న దుకాణాల్లో బంగారం కొనడం మంచిదా అనే దానిపై మీకు అనేక సందేహాలు ఉండే ఉంటాయి. ఇలాంటి సందేహాలు తలెత్తినప్పుడు, వినియోగదారులు ఖచ్చితంగా బంగారం కొనుగోలు విషయాల గురించి తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకున్న తర్వాతే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి. ఎందుకంటే.. డబ్బులు ఎవరీ ఊరికే రావని అంటారు కాదా..!

బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?
Buying Gold Jewellery
Jyothi Gadda
|

Updated on: Feb 17, 2025 | 3:59 PM

Share

ప్రస్తుతం మాఘ మాసం ప్రారంభమైంది. వివాహాది శుభకార్యాలు, పండగలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నెలలో ప్రతి ఒక్కరికీ శుభ సందర్భాలకు, శుభ కార్యక్రమాలకు, పెళ్లిపేరంటాలకు వెళ్లేందుకు బంగారు ఆభరణాల కోసం చూస్తుంటారు.. ఇలా నగలు కొనేందుకు చాలా మంది కస్టమర్లు పెద్ద పెద్ద దుకాణాలకు వెళ్తుంటారు. దేశంలో కార్పొరేట్ బంగారు షాపింగ్ మాల్స్ నుండి అనేక చిన్న చిన్న బంగారు దుకాణాలు వేలల్లో వేలిశాయి..కానీ, చాలా మంది కార్పొరేట్ షాపింగ్ మాల్స్ కు వెళ్తుంటారు. కానీ, మీరు ఎప్పుడైనా ఆలోచించారా..కార్పొరేట్ షాపింగ్ మాల్‌లో బంగారం కొనడం మంచిదా లేక చిన్న దుకాణాల్లో బంగారం కొనడం మంచిదా అనే దానిపై మీకు అనేక సందేహాలు ఉండే ఉంటాయి. ఇలాంటి సందేహాలు తలెత్తినప్పుడు, వినియోగదారులు ఖచ్చితంగా బంగారం కొనుగోలు విషయాల గురించి తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకున్న తర్వాతే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి. ఎందుకంటే.. డబ్బులు ఎవరీ ఊరికే రావని అంటారు కాదా..!

బంగారం, వెండి ఆభరణాలు, నగలు సాధారణంగా వివాహాలు, ఇతర శుభ సందర్భాలలో ఎక్కువగా కొంటుంటారు. దేశంలో లెక్కలేనన్ని బంగారు దుకాణాలు ఉన్నాయి. కానీ చాలా మంది వినియోగదారులకు బంగారం ఎక్కడ కొనాలనే సందేహం ఉంటుంది. అలాంటప్పుడు.. బంగారం ముందు గుర్తుంచుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.

* మీరు కొంటున్న బంగారం 916 కాడ్మియం లేదా హాల్‌మార్క్ ఉందా అని విషయాన్ని వినియోగదారులు తప్పక తెలుసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* అలాగే, మనం బంగారం కొనుగోలు చేసేటప్పుడు, దాని రేటు ఎంత, దానితో సంబంధం ఉన్న తరుగుదల, వేతనాలు ఎలా వసూలు చేస్తారు. ఇతర GST పన్నులు ఎలా విధించబడతాయో మనం వివరంగా తెలుసుకోవాలి. వారికి నచ్చిన నగల డిజైన్‌ను ఇతర దుకాణాల్లో అమ్మితే మార్జిన్ ఎంత తగ్గుతుందో కూడా వారు తెలుసుకోవాలి.

* బంగారు ఆభరణాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే, 916 KDM తో పాటు, 750 KDM కూడా ఉంటుంది. మీరు దీన్ని బాగా తెలుసుకోవాలి.

* బంగారు దుకాణ యజమాని మనకు ఏ రకమైన బంగారాన్ని అమ్ముతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా ముఖ్యంగా, మీరు కొన్న బంగారు నగలను తిరిగి అమ్మితే ఎంత ధర లభిస్తుందో తెలుసుకున్న తర్వాతే వాటిని కొనాలి. ఇలాంటి విషయాలన్నీ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది కూడా చదండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్‌ చేసేయండిలా..

ఇది కూడా చదండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..