బ్రెయిన్ ఉన్నవాళ్లే ఈ ట్యాప్ తిప్పగలరు! మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి
భారతీయులు జుగాడ్‌లు తయారుచేయడంలో వారికి వారే సాటి. చేసే పనిలో బోరు కొట్టకుండా కొత్త కొత్త ఐడియాలతో సరికొత్తగా చేస్తూ ప్రతిభను చాటుకుంటారు. ఇటీవల ఓ ఎలక్ట్రీషియన్ ఇంటికి వైరింగి చేస్తూ మేడపైన ఉన్న వ్యక్తి వైరు పంపాల్సిన పైపును గుర్తించేందుకు సిగరెట్ వెలిగించి దానిలోంచి పొగను వదులుతాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఇప్పడు అంతకు మించిన సూపర్ ఐడియా వేశాడు ఓ ప్లంబర్. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు.. బ్రెయిన్ ఉన్నవాళ్లే ఈ ట్యాప్‌ను ఆన్ చెయ్యగలరంటూ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ట్యాప్ ఆన్ చేశాడు. కానీ అందులోంచి నీళ్లు రాలేదు. నిజానికి ఆ ట్యాప్ తలక్రిందులుగా ఉంది. ఓకే వెరైటీగా ఉండేందుకు అలా సెట్ చేశారేమో అనుకున్నాడు. కానీ ఎంత తిప్పినా ట్యాప్‌లోంచి నీళ్లు రావట్లేదు. దాంతో ఆ కుళాయిని అటూ ఇటూ తిప్పాడు. దీంతో రివర్స్‌లో ఉన్న కుళాయి కిందకి రాగానే ట్యాప్ ఆన్‌చేయడానికి ఉపయోగించే హ్యాండిల్ లాంటి దాన్లోంచి నీళ్లు వచ్చాయి. అదిచూసి షాకయిన ఆ వ్యక్తి కుళాయిని పదే పదే కిందకి పైకి తిప్పిచూశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ కుళాయిని చూసి అంతా అవాక్కవుతున్నారు. అమ్మో ఈ కుళాయి ఆన్ చేయాలంటే బ్రెయిన్ వాడాలి..ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు అంటూ రకరకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 3 మిలియన్లమందికి పైగా వీక్షించారు. 6 వేలమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి! దీని ప్రత్యేకతేంటో తెలుసా?
రోజూ ఆవుల దొడ్డిలోకి వెళుతున్న ఓ జంతువు.. సీసీ కెమెరాలో దానిని చూసి యజమాని షాక్
మరో ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ బ్రిడ్జ్
ఆఫీసుకి రోజూ 700 కి.మీ వెళ్ళొస్తుంది! ఎందులోనో తెలుసా
Ram Charan: నిజమే.. చరణ్ వాచ్ రేటుతో.. హైదరాబాద్ లో ఇల్లే కొనేయచ్చు!