అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త!
ప్రతి ఇంటి వంట గదిలో అల్యూమినియం పాత్రలు కనిపిస్తాయి. చాలామంది అల్యూమినియం పాత్రల్లోనే వంట చేస్తుంటారు. ఇది మంచిదికాదని, అల్యూమినియం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండొందల ఏళ్ల క్రితం డెన్మార్క్ లో కనిపెట్టిన అల్యూమినియంను ఆ దేశంలో కంటే భారత్‌లోనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీని దెబ్బకు మట్టి, ఇత్తడి, కంచు, రాగి పాత్రలు దాదాపు కనుమరుగైపోయాయి. అల్యూమినియంను డెన్మార్క్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త 1825 లో కనుగొన్నారు. భారత్ లో అల్యూమినియం ఉత్పత్తిని ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ 1938 లో ప్రారంభించింది.
అప్పటినుంచి వీటి వాడకం విస్తృతమైంది. కానీ వీటిని వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? దీర్ఘకాలంగా అల్యూమినియం పాత్రల వాడకంతో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా ఈ లోహానికి శరీర నిర్మాణంలో ఎలాంటి పాత్రా లేదు. అందుకే అధిక భాగం మూత్ర విసర్జన రూపంలో బయటికి వెళ్లిపోతుంది. కడుపులోకి వెళ్లిన అల్యూమినియంలో 0.01% నుంచి 1% వరకూ జీర్ణకోశంలోకి చేరుతుంది. దీన్ని మూత్ర పిండాలు బయటకు వెళ్లగొడతాయి. అయితే దీనికి కణజాలాల్లో పేరుకునే స్వభావం ఉండటం వల్ల ఎముకలు, మెదడు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదముంది. ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీజబ్బుతో బాధపడేవారికి మరింత ఎక్కువ హాని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా టమాటా, నిమ్మ, చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుంది. ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకు అవసరం. శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం ఇటువంటి ఉపయోగకరమైన లోహాలను మన శరీరానికి ఉపయోగపడకుండా నిరోధిస్తుంది. దాంతో రక్తహీనత, ఎముకలు మెత్తబడటం, డయాలిసిస్ ఎన్ కెఫలోపతి అనే నాడీ మండల వ్యాధికి కారణమవుతుందంటున్నారు.

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
