అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి! దీని ప్రత్యేకతేంటో తెలుసా?
శేషాచలం.. దట్టమైన అటవీ ప్రాంతం. తూర్పు కనుమల్లో అంతర్భాగం. అంతే కాదు విభిన్నమైన జంతు జాతులు, అరుదైన వృక్ష సంపదకు నిలయం. ఇలాంటి ప్రాంతంలో అత్యంత అరుదైన కలివి కోడి జాడ వెలుగులోకి వచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో కలివి కోడి ఆవాసం ఉన్నట్లు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నిర్వహించిన బర్డ్ అట్లాస్-2 వేడుక బయట పెట్టింది.
మూడు రోజుల క్రితం ఐఐటి, ఐసర్, తిరుపతి నేచర్ సొసైటీ, తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ సంయుక్తంగా నిర్వహించిన తిరుపతి బర్డ్ అట్లాస్ వేదికపై దీనిమీద చర్చ జరిగింది. ఆంధ్రా బర్డర్స్ మీట్… ఈ కలివి కోడి ఆవాసం, లభించిన ఆనవాళ్లను బయటపెట్టింది. ఈ విషయాన్ని ఐసర్ పరిశోధన శాస్త్రవేత్త వీరల్ జోషి బర్డ్ అట్లాస్‌లో స్పష్టం చేశారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కలివి కోడి ఆవాసంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు గుర్తించారు. వేర్వేరుగా మొత్తం 6 ప్రాంతాల్లో ఆధారాలు దొరికాయని, మరో 12 ప్రాంతాల్లో కలివి కోడి తిరిగిన ఆనవాళ్లు గుర్తించామని వివరించారు. రాత్రి వేళల్లో మాత్రమే కనిపించే కలివి కోడి పొదల్లో దాగి ఉంటుందని చెబుతున్నారు. పైకి ఎగరలేని పక్షి జాతి కలివి కోడిని అరుపులు, పాద ముద్రలు ఆధారంగా గుర్తిస్తారు. అరుదైన పక్షి జాతి అయిన కలివి కోడి ఉనికిని కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తల పరిశోధన కొనసాగుతోంది. 2005 లోనే శేషాచలం ప్రాంతంలో కలివి కోడిని.. శాస్త్రవేత్త జగన్ ఈ పక్షిని తన కెమెరాలో బంధించారు. ఇది కంజు పిట్టలా కనిపించినా పరిమాణంలో దాని కన్నా పెద్దదిగా ఉంటుంది. కలివి కోళ్లు గులకరాళ్లను సేకరించి వాటి మధ్యలో గుడ్లు పెడతాయి. మెడలో వెండి గొలుసులు వేసుకున్నట్లుగా రెండు తెల్లటి చారలు ఉంటాయి. ఇవి ముదురు గోధుమ రంగులో పొడవాటి కాళ్లు కలిగి ఉంటాయి. వీటి ఆవాసం ముళ్ల పొదలు. పగటిపూట నిద్ర, రాత్రి ఆహార అన్వేషణ వీటి ప్రత్యేక లక్షణం. దీని కూత ‘ట్విక్ టూ, ట్విక్ టూ’ అన్నట్లుగా ఉండి.. 200 మీటర్ల దూరం వరకు వినిపిస్తుందట.
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

