సర్పంచ్ సీటు కావాలా? అయితే కోతులను పట్టుకోవాల్సిందే
ఇటీవల వన్యప్రాణులు.. అడవులను వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వీటి బెడద ఎక్కువగా ఉంటోంది. ఇళ్లలో చొరబడి నానా హంగామా చేస్తున్నాయి. ఇళ్లు పైకప్పులు ధ్వంసం చేస్తున్నాయి. కోతుల బెడద నుంచి రక్షించండి బాబోయ్ అని ఎంత మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలూ ఉన్నాయి.
తాజాగా గ్రామీణ ప్రజలకు కోతుల బెడదను వదిలించుకునేందుకు ఓ అస్త్రం దొరికింది. త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో వాళ్ల విజయానికి కోతుల సమస్యకు ముడిపెట్టారు. ఇంకేముంది.. సర్పంచ్ అభ్యర్ధులుగా పోటీచేసే వారికి కోతులు కొత్త తిప్పలు తెచ్చిపెట్టాయి. గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడత తీవ్రతరం అవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఈ కోతులు కొత్త తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా రోజురోజుకు కోతుల బెడత ఎక్కువ అవుతుంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు గ్రామాల్లో అన్ని సమస్యల కంటే కోతుల సమస్యే ప్రధానంగా మారింది. త్వరలో పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచి సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా కోతుల సమస్య తీరిస్తేనే ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు ప్రజలు. దాంతో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వీటన్నింటిని పక్కనబెట్టి ఇప్పుడు కోతుల సమస్యపైనే దృష్టి సారిస్తున్నారు ప్రజలు. కోతుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇంటిపై పెంకులు ఊడకొట్టడం, ఇంట్లో వస్తువులను ధ్వంసం చేస్తూ.. ఆహార పదార్థాలను సైతం ఎత్తుకెళ్తున్నాయి. తమపై దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి! దీని ప్రత్యేకతేంటో తెలుసా?
రోజూ ఆవుల దొడ్డిలోకి వెళుతున్న ఓ జంతువు.. సీసీ కెమెరాలో దానిని చూసి యజమాని షాక్
మరో ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ బ్రిడ్జ్
ఆఫీసుకి రోజూ 700 కి.మీ వెళ్ళొస్తుంది! ఎందులోనో తెలుసా
Ram Charan: నిజమే.. చరణ్ వాచ్ రేటుతో.. హైదరాబాద్ లో ఇల్లే కొనేయచ్చు!

మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండి బాబోయ్..!

బీచ్లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్

నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో
