రోజూ ఆవుల దొడ్డిలోకి వెళుతున్న ఓ జంతువు.. సీసీ కెమెరాలో దానిని చూసి యజమాని షాక్
పులులు, సింహాలు వంటి క్రూరమృగాలు కనిపించాయంటే ఎంతటి ధీరుడైనా వణికిపోవాల్సిందే. ఇటీవల చిరుతలు, పెద్ద పులులు జనవాసాల్లో సంచరిస్తూ మరింత హడలెత్తిస్తున్నాయి. జంతువులు, మనుషులపై దాడి చేసి చంపిన సంఘటలు ఇటీవల వెలుగు చూశాయి. అయితే అలాంటి క్రూర జంతువులు ఒక్కోసారి సాధు జంతువులుగా మారిపోయి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.
పంజా విసరాల్సిన జంతువులతో దోస్తాన్ చేసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటాయి. అలాంటి విచిత్ర ఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రాత్రి వేళ ఓ చిరుతపులి ఆవుల షెడ్‌లోకి వెళ్లింది. ఓ రోజు యజమానికి డౌట్ వచ్చి సీసీ ఫుటేజీ పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి షెడ్ ఏర్పాటు చేసి ఆవులను పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల వారి గోశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రోజూ ఆవుల షెడ్‌లోకి ఏదో జంతువు వచ్చి వెళ్తున్నట్లు యజమానికి సందేహం వచ్చింది. దీంతో ఓ రోజు ఉదయం గోశాల వద్ద ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను పరిశీలించాడు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. ఓ చిరుత పులి రోజూ రాత్రి గోశాలలోకి వచ్చి ఆవు పక్కనే పడుకుంటున్నట్లు గమనించాడు. చిరుత పులి ఆవు పక్కన పడుకోవడం ఏంటీ అని అంతా షాక్ అయ్యారు. అయితే అసలు కథ తెలుసుకుని భావోద్వేగం చెందారు. కొన్ని నెలల కిందట పిల్లకు జన్మనిచ్చిన చిరుత పులి చనిపోయింది. ఆ సమయంలో చిరుత పులి పిల్లకు 20 రోజుల వయస్సు. అప్పట్లో ఆవు ఆ చిరుత పులి పిల్లకు పాలు ఇచ్చింది. దీంతో పిల్ల చిరుత ఆవును తన తల్లిగా భావించింది. రోజూ చిరుత పులి ఆ ఆవు వద్దకు వచ్చి పాలు తాగుతూ ఉండేది. ఇలా ఆ రెండింటి మధ్య తల్లీ, పిల్లల బంధం ఏర్పడింది. ఆవు కూడా ఆ చిరుతను పక్కనే పడుకోబెట్టుకుంటూ ఉంది. ఇలా చిరుత పులి, ఆవు.. తల్లీపిల్లల్లా కలిసిపోవడాన్ని అంతా ఆసక్తిగా చర్చించుంటున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ బ్రిడ్జ్
ఆఫీసుకి రోజూ 700 కి.మీ వెళ్ళొస్తుంది! ఎందులోనో తెలుసా
Ram Charan: నిజమే.. చరణ్ వాచ్ రేటుతో.. హైదరాబాద్ లో ఇల్లే కొనేయచ్చు!

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
