Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లివేదికపై రెండు జంటలూ ఒకేలా.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది

పెళ్లివేదికపై రెండు జంటలూ ఒకేలా.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది

Phani CH

|

Updated on: Feb 17, 2025 | 7:29 PM

పెళ్లంటేనే సరదా సరదాగా ఆనందంగా సాగిపోయే వేడుక. పెళ్లిలో వధూవరులను బంధుమిత్రులు ఆటపట్టిస్తూ ఉంటారు. కొందరు కావాలని ప్లాన్ చేసి ప్రాంక్‌లు ప్లాన్ చేస్తుంటారు. కొన్నిసార్లు అనుకోకుండానే అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి ఓ చిత్రవిచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పెళ్లిమండపంలో పెళ్లి తంతు జరగుతోంది. వధూవరులు వేదికపై దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత వధువు.. వరుడి మెడలో పూలమాలతోపాటు ఓ బంగారు గొలుసును కూడా వేసింది. దీంతో ఆ వరుడు వధువు వైపు ఆశ్చర్యంగా చూసి నవ్వుతాడు. వధువు కూడా హ్యాపీగా నవ్వుతుంది. ఇంతవరకూ ఓకే. ఇక్కడే అసలు ట్విస్ట్‌ నెటిజన్లను మతిపోగొట్టేలా చేసింది. అదే పెళ్లి మండపంలో వేదిక కింద మరో నూతన జంట పెళ్లిబట్టల్లో ఉంది. ఆ ఇద్దరూ కూడా సేమ్‌ టు సేమ్‌ పెళ్లి వేదికపైన ఉన్న వధూవరుల్లాగే ఉన్నారు. ఆ రెండు జంటలూ కవలలని తెలిసింది. ఇలా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఒకే పోలికలతో ఉండడం, ఒకే ఇంటివారిని పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది మామూలు ట్విస్ట్‌ కాదు బాబోయ్‌ అంటూ..రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షమంది వీక్షించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్రెయిన్‌ ఉన్నవాళ్లే ఈ ట్యాప్ తిప్పగలరు! మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి