ఈ పచ్చి పండు డయాబెటిస్ రోగులకు అమృతం.. డ్రైఫ్రూట్స్ కంటే రెట్టింపు ఆరోగ్యం..!
మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటివి సమృద్ధిగా తినాలని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు. అయితే, పండ్లలో కొన్ని పచ్చివి కూడా మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయని మీకు తెలుసా..? అందులో ఒకటి అరటి కాయ.. అవును పచ్చి అరటికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. అరటిపండులో ఎలాగైతే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అరటి కాయలో కూడా పుష్కలమైన పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పచ్చి అరటికాయను కూడా తరచూ తినాలని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారికి పచ్చి అరటికాయతో కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Feb 15, 2025 | 12:28 PM

అరటి కాయ మధుమేహంలో ఎంతో ప్రయోజనకరమైనది. అరటికాయలో పెక్టిన్, రెసిస్టెంట్ స్టార్చ్ ఉండటం వల్ల ఇది డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. పచ్చి అరటికాయలో ఉండే ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కడుపులో వ్యర్ధాలను బయటికి తరిమేస్తుంది. పచ్చి అరటికాయలో ఉండే ఫైబర్ శరీరంలో ఫ్యాట్ పేరుకోకుండా ఇన్సులిన్ నిర్వహిస్తుంది. గ్రీన్ బనానా లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

పచ్చి అరటికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి అరటికాయ కడుపులో యాసిడిటీ, కడుపునొప్పి, అజీర్తి, పుల్లటి తెన్పులు వంటి సమస్యలను అధిగమిస్తుంది. పచ్చి అరటికాయలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల ఇది బరువు తగ్గడానికి కూడా మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా భయంకరమైన ఫైల్ సమస్యల నుంచి కూడా అరటికాయ రక్షిస్తుంది.

అరటి కాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది నాడి వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కిడ్నీలలోని రక్తాన్ని ప్యూరి ఫై చేస్తుంది..అరటికాయలో విటమిన్ బీ6, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులోని మెగ్నిషియం, క్యాల్షియం వల్ల ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతుంది కీళ్ల వ్యాధులు రాకుండా నివారిస్తుంది.

పచ్చి అరటిపండులో రక్తపోటును నియంత్రించే పోషకాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది అధిక రక్తపోటు రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి అరటిపండులో యాంటీఆక్సిడెంట్లు కూడా చాలా మంచివి. ఇది క్యాన్సర్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

అంతేకాదు దంతాక్షయం, నోటి పుండ్లు ,పిప్పి పన్ను రాకుండా కాపాడుతుంది. ఈ అరటికాయ తినడం వల్ల ఎముక ఆరోగ్యం బాగుంటుంది. దీంతో మెడ,నడుము నొప్పి వంటి సమస్యలు దరిచేరవు. ఈ అరటికాయ శరీరంలో వైరస్లు, బ్యాక్టిరియా రాకుండా నిరోధిస్తుంది. అంతేకాదు..నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి కూడా పచ్చి అరటికాయ బెస్ట్ రెమెడీ అంటున్నారు నిపుణులు. ఈ అరటికాయతో చేసిన పులుసు తినడం వల్ల గాఢ నిద్ర పడుతుంది.




