Optical illusion: గోవా అనుకోని గ్రీన్ ఆపిల్ ని కూడా కలిపేసారు..! మీరు గ్రీన్ ఆపిల్ ని కనిపెట్టగలరా..?
ఇవాళ్టి మన ఆప్టికల్ ఇల్యూషన్ కొంచం కష్టంగా ఉండబోతుంది. కొందరికి అయితే చాలా ఈజీగా కూడా ఉండొచ్చు. నేటి టాస్క్ లో మనం గ్రీన్ ఆపిల్ ని గుర్తించాల్సి ఉంటుంది. గ్రీన్ గోవాల మధ్య గ్రీన్ ఆపిల్ ని కనిపెట్టడం అంత ఈజీ ఏం కాదు. కానీ ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం కుటుంబంతో సహా ఈ ఇల్యూషన్ లో పాల్గొనండి.

మీరు చూస్తున్న ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ లో గ్రీన్ గోవాలతో మొత్తం నిండిపోయి ఉంది కదా. దీంట్లోనే గ్రీన్ గోవా అనుకోని గ్రీన్ ఆపిల్ ని పెట్టేసారు. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. మంచి దృష్టి ఉన్న వాళ్లు చాలా ఈజీగా కనిపెట్టేస్తారు. మొదటి సారి మీరు ఈ చిత్రాన్ని చూస్తే అది మొత్తం గోవాలతోనే ఉంది కదా అనిపిస్తుంది. కానీ కొంచం ఫోకస్ చేసి చూడండి.
మరోసారి క్షుణ్ణంగా పరిశీలించండి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు మన అభిప్రాయాన్ని మభ్యపెడతాయి, కాబట్టి మనం ఆపిల్‌ను మొదట గమనించలేము. ఆప్టికల్ ఇల్యూషన్లు మనల్ని ఎందుకు మభ్యపెడతాయి అంటే మన బ్రెయిన్ ఎక్కువగా పటర్న్స్ గుర్తించడానికి పనిచేస్తుంది. ఒకే ఆకారమైన వస్తువులు పక్కపక్కగా ఉన్నప్పుడు మనం వాటిని ఒకటిగా పరిగణిస్తాము. ఇందువల్ల మనం చిన్న మార్పులను గమనించకపోవచ్చు.

మనం ఎంత ఫోకస్ చేసి చూసినా.. నిజానికి మనం ఆపిల్‌ను పూర్తిగా గమనించలేము. ఇది ఒక్కసారిగా కనిపించదు. పైగా మీకు సమయం కూడా చాలా తక్కువ 10 సెకన్లలోనే కనిపెట్టాల్సి ఉంది. మీకు ఎంత సమయం పడుతుందో నాకు తెలీదు. సాధారణంగా ఈ పజిల్‌ను 15 నుంచి 20 సెకన్లలో గుర్తించవచ్చు. ప్రతిరోజు యాక్టీవ్ గా పాల్గొనే వారు అయితే కేవలం 10 సెకన్లలోనే గుర్తించవచ్చు. మరి కొంతమందికి అయితే ఒక నిమిషం కూడా పట్టవచ్చు.
ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తాయి. ఈ ఇల్యూషన్లు సైకాలజీ, న్యూరోసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉపయోగపడతాయి. ఈ ఇల్యూషన్లు మన దృష్టిని మెరుగుపరచడానికి, సృజనాత్మకతను పెంచడానికి, చిన్న చిన్న వివరాలను త్వరగా గుర్తించడంలో సహాయపడతాయి.
ఇంతకీ మీరు గ్రీన్ యాపిల్ ని కనిపెట్టారా.. లేదా.. కనిపెట్టినవారికి ధన్యవాదాలు. కనిపెట్టనివారు చింతించకండి. గ్రీన్ ఆపిల్ ని నేను వెతికి ఇస్తాను మీకు. ఇదిగో గ్రీన్ ఆపిల్ ఇక్కడే ఉంది చూడండి.

