Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీళ్ల రీల్స్‌ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్‌ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్‌ పేలటంతో..

ప్రత్యేకమైన కంటెంట్ కారణంగా చాలా మంది వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంతో పాటు వారిలో కొందరు రాత్రి రాత్రే ఫేమస్‌ అయిన ఉదంతాలు కూడా అనేకం ఉన్నాయి. అలాగే, కొందరు రీల్స్‌ పిచ్చితో ప్రమాదాల బారినపడ్డ సందర్బాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. బర్త్‌డే పార్టీలో వెరైటీ రీల్స్‌ చేసిన ఓ యువకుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు.. వారి బర్త్‌డే వేడుక కాస్త వాళ్లందరినీ భయపెట్టేదిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral Video: వీళ్ల రీల్స్‌ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్‌ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్‌ పేలటంతో..
Firecracker In The Cake
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 17, 2025 | 5:57 PM

ప్రస్తుత ఇంటర్‌నెట్‌లో ప్రపంచంలో సోషల్ మీడియా అంతా రీల్స్‌ మాయాజాలంతో నిండిపోయి కనిపిస్తుంది. చాలా మంది సోషల్ మీడియాను రీల్స్ చూడటానికి కాకుండా రీల్స్ తయారు చేసి పోస్ట్ చేసి వాటి ద్వారా ఫేమస్ అవ్వడానికే ఎక్కువగా ఆరాటపడుతున్నారు. వారి వారి ప్రత్యేకమైన కంటెంట్ కారణంగా చాలా మంది వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంతో పాటు వారిలో కొందరు రాత్రి రాత్రే ఫేమస్‌ అయిన ఉదంతాలు కూడా అనేకం ఉన్నాయి. అలాగే, కొందరు రీల్స్‌ పిచ్చితో ప్రమాదాల బారినపడ్డ సందర్బాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. బర్త్‌డే పార్టీలో వెరైటీ రీల్స్‌ చేసిన ఓ యువకుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు.. వారి బర్త్‌డే వేడుక కాస్త వాళ్లందరినీ భయపెట్టేదిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది కలిసి బర్త్‌డే పార్టీలో నిలబడి ఉన్నారు. వారి ముందు కట్‌ చేసేందుకు ఒక కేక్ రెడీగా ఉంది. కేక్ పైన తామరపువ్వు ఆకారంలో ఉన్న క్యాండిల్‌ కూడా ఏర్పాటు చేశారు..అప్పటికే అక్కడ బర్త్‌డే జరుగుతున్న ఆ అమ్మాయి క్యాండిల్‌ వెలిగించి భయంతో వెనక్కి అడుగులు వేస్తుంది. కానీ, క్యాండిల్‌ సురక్షితంగానే వెలిగింది.. కానీ, ఆ మరుక్షణంలోనే ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే క్షణాల్లో అక్కడున్న కేక్‌ ఒక్కసారిగా పేలిపోయి చెల్లాచెదురుగా పడిపోయింది. కానీ, అదృష్టవశాత్తు ఎవరీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదంతా వీడియో రికార్డ్‌ చేసి సోషల్ మీడియాలో షేర్‌ చేయటంతో అది కాస్త వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

మీరు చూసిన ఈ వీడియోను @sk465g అనే ఖాతా ద్వారా X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు,’కేక్‌ను అబ్దుల్ ఫ్యాక్టరీ నుండి ఆర్డర్ చేసినట్లు కనిపిస్తోంది’ క్యాప్షన్‌లో ఉంది. కాగా, ఇప్పటికే చాలా మంది ఆ వీడియోను చూశారు. వీడియో చూసిన ఒకరు స్పందిస్తూ.. కేక్‌కు బదులుగా మీరు క్రాకర్స్ ఆర్డర్ చేశారనుకుంటా అని రాశారు. మరొకరు స్పందిస్తూ.. అలాంటి పటాకులను కేక్ మీద పెట్టడం సరైనది కాదని అంటున్నారు. సంతోషకర సందర్భం కాస్త విషాదంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలా చాలా మంది నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు.

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..

ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?

ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్‌ చేసేయండిలా..

ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంటర్‌ ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!
ఇంటర్‌ ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!
ఈ పండ్లు తింటే మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది..!
ఈ పండ్లు తింటే మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది..!
కొత్త ఇల్లు నిర్మాణం.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..
కొత్త ఇల్లు నిర్మాణం.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు
వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..!
వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..!
ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే..
ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే..
షుగర్ కు చెక్ పెట్టాలంటే ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగాల్సిందే
షుగర్ కు చెక్ పెట్టాలంటే ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగాల్సిందే