ProDiscover: ఫోరెన్సిక్ సైన్స్‌లో అద్భుత ఆవిష్కరణ.. డిజిటల్ బెదిరింపులు అరికట్టేందుకు ‘ప్రోడిస్కవర్ ఫ్లెక్స్ కీ’
టెక్నాలజీ ఆధారిత నేరాలపై అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ క్రైమ్ సమ్మిట్-2025 ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగింది. ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్(FCRF) నిర్వహించిన ఈ రెండు రోజుల కార్యక్రమంలో సైబర్ భద్రతా నిపుణులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు, రక్షణ సిబ్బంది, సైబర్ న్యాయవాదులు, నిఘా అధికారులు వంటి ప్రముఖులు హాజరయ్యారు.

టెక్నాలజీ ఆధారిత నేరాలపై అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ క్రైమ్ సమ్మిట్-2025 ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగింది. ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్(FCRF) నిర్వహించిన ఈ రెండు రోజుల కార్యక్రమంలో సైబర్ భద్రతా నిపుణులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు, రక్షణ సిబ్బంది, సైబర్ న్యాయవాదులు, నిఘా అధికారులు వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ ఆధారిత నేరాలు ఎక్కువైపోయాయి. వాటిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి.? డిజిటల్ బెదిరింపులను ఎలా అరికట్టాలి.? లేటెస్ట్ ఫోరెన్సిక్ ఆవిష్కరణలను ఏంటి.? లాంటి అంశాలపై వీరంతా కీలకంగా చర్చించారు.
ఇదిలా ఉంటే.. ఈ సమ్మిట్‌లో డిజిటల్ ఫోరెన్సిక్స్ సంస్థ ‘ProDiscover’ నూతన ఆవిష్కరణ ‘ProDiscover FlexKey’ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఫోరెన్సిక్ దర్యాప్తులను ఇది ఎలా క్రమబద్దీకరిస్తుందో సైబర్ నిపుణులు చర్చించుకున్నారు. అలాగే ఆ సంస్థ తమ తాజా ఆవిష్కరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. మేకిన్ ఇండియా నేపధ్యంలో ‘ProDiscover FlexKey’ని తయారు చేశామని ఆ సంస్థ అధికారులు తెలిపారు. ఇదొక నెట్‌వర్క్ ఆధారిత లైసెన్స్ నిర్వహణ వ్యవస్థగా పేర్కొన్నారు. ఈ FlexKey ఫోరెన్సిక్ నిపుణులు లైసెన్స్‌లను సజావుగా పంచుకోవడమే కాకుండా, కావాల్సిన వనరులను ఉపయోగించుకోవడానికి.. పనికిరాని, వాడనటువంటి వనరులను సునాయాసంగా తొలగిస్తుందని అన్నారు. FlexKey ఫోరెన్సిక్ దర్యాప్తులను క్రమబద్దీకరించడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం లాంటి అంశాలు ఈ కార్యక్రమంలో హైలైట్‌గా నిలిచాయి. సైబర్ ఫోరేన్సిక్స్, డిజిటల్ బెదిరింపులు, టెక్నాలజీ చట్టం.. ఈ మూడు ప్రధానాంశాలే ఎజెండాగా ఫ్యూచర్ క్రైమ్ సమ్మిట్-2025 కొనసాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సైబర్ ఎక్స్‌పర్ట్స్ బృందం.. కొత్త సైబర్ ప్రమాదాలు, దర్యాప్తు పద్దతులపై లోతైన అవగాహనను కల్పించారు. అలాగే డిజిటల్ ఇన్వెస్టిగేషన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ స్ట్రాటజీలపై కీలక విషయాలు పంచుకున్నారు.
సుమారు 23 ఏళ్లకుపైగా అనుభవంతో డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో పలు ఆవిష్కరణలు చేసి.. ఫోరెన్సిక్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలిచింది ‘ProDiscover’. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ‘ProDiscover’ సంస్థ సీఈఓ నృపుల్ రావు తమ సంస్థ ఫోరెన్సిక్ టూల్స్ పనితీరును లైవ్‌లో చూపించారు. డిస్క్ ఇమేజింగ్, లైవ్ మెమరీ విశ్లేషణ, డేటా రికవరీ, అధునాతన రిపోర్టింగ్ వంటి ‘ProDiscover’ ఫోరెన్సిక్ సాధనాలు.. సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పరిశోధకులకు శక్తినిస్తాయని ఆయన తెలిపారు. మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీని ముందుకు సాగిస్తూ.. ‘ProDiscover’ సంస్థ తమ ఫోరెన్సిక్ సాధనాలను నెక్స్ట్ జెన్ టెక్నాలజీ హబ్‌గా మారుతున్న హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్నారు. దేశీయ ఆవిష్కరణలపై కంపెనీకి ఉన్న నిబద్ధతను ఈ సమ్మిట్‌లో హైలైట్ చేశారు.
