తొక్కే కదా అని తీసి పారేయొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు..!
సాధారణంగా మనమందరం అరటి పండు తినేసి, తొక్కను పడేస్తాం. కానీ తొక్క చేసే ప్రయోజనాలు తెలిస్తే.. తొక్కను కూడా పడేయారు. ఏంటి తొక్కతో ప్రయోజనాలా ఏంటవి అనుకుంటున్నారా? అరటిపండు మన శరీరానికి ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. అలాగే, అరటి తొక్కతోనూ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Feb 18, 2025 | 8:07 PM

అరటి తొక్కలు మిథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. వీటిని మొక్కల చుట్టూ వేయడం వల్ల కంపోస్ట్‌లా ఉపయోగపడతాయి. అరటిపండు తొక్కతో పురుగులను బంధించేందుకు ట్రాప్ తయారు చేయొచ్చు. ప్లాస్టిక్ బకెట్‌లో అరటి తొక్కను వేయడం వల్ల పురుగులు ఆకర్షితమవుతాయి.

అరటి తొక్కలు కంపోస్ట్ మాదిరి పని చేస్తాయి. అరటి తొక్కలో ఉండే పొటాషియం, ఫాస్ఫరస్ మొక్కలు బాగా ఎదగడానికి సహాయపడతాయి. అరటి తొక్కలు ఫెర్టిలైజర్ మాదిరి పనిచేస్తాయి. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి.

దోమలు లేదా ఏదైనా ఇతర కీటకాలు కుట్టినప్పుడు చాలా మంటగా ఉంటుంది. అవి కుట్టిన చోట అరటి తొక్కతో రుద్దడం వల్ల దురద తగ్గుతుంది. అరటితొక్కలోని తెల్లటి భాగాన్ని మొఖంపై 10 నిముషాల రుద్దాలి. చర్మం మెరిసిపోతుంది.

దంతాలు పచ్చగా ఉన్నట్లయితే అరటి తొక్కని పంటిపై రుద్దండి. ఇలా రబ్ చేయడం వల్ల దంతాలు తెల్లగా ఉంటాయి. పంటిపై మరకలు అన్నీ కూడా తొలగుతాయి. అలాగే, అరటి తొక్కల్ని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. అందంగా కనపడొచ్చు. ఇందులో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి.

చేతులు, కాళ్లకు ముళ్లు, చెక్క ముక్కలు గుచ్చుకున్న సందర్భాల్లో దానిపై అరటితొక్కను 30 నిముషాల పాటు ఉంచితే అందులోని ఎంజైమ్‌ల కారణంగా లోపల ఉన్న ముళ్లు బయటికి వస్తుంది. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని తినడం వల్ల రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుంది.

అరటి తొక్కలను తీసుకుంటే మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అరటి తొక్కలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలు లేకుండా చూస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖానికి అరటి తొక్కల్ని రుద్దడం వలన ముఖం హైడ్రేట్‌గా ఉంటుంది. చర్మం స్మూత్‌గా మారుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.





























