- Telugu News Photo Gallery Cinema photos Samantha ruth prabhu photos goes viral in social media on 18 02 2025
Samantha: సోషల్ మీడియాలో సమంత సందడి.. అభిమానులను మిస్ అవ్వను అంటున్న ముద్దుగుమ్మ
ట్రెండింగ్‌లో ఎలా ఉండాలో తెలిసినప్పుడు సినిమాలు చేసినా చేయకపోయినా పెద్దగా ఫరక్ పడదు..! సమంత చేస్తున్నదిదే ఇప్పుడు. సౌత్‌లో సినిమాలు చేయపోయినా.. కనబడకపోయినా రెగ్యులర్‌గా ఇక్కడ ఈవెంట్స్‌కు వస్తూ అభిమానులను మిస్ అవ్వకుండా చూస్తున్నారు స్యామ్. తాజాగా చెన్నైకి వచ్చారీమే. మరి అక్కడేం చేసారో తెలుసా..?
Updated on: Feb 18, 2025 | 8:04 PM

సమంత.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ వినిపించే పేరు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. స్యామ్ నేమ్ వైరల్ అవుతుంది.

సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చినట్లు కనిపించినా.. అభిమానులకు మాత్రం అస్సలు మిస్ చేయట్లేదు ఈ బ్యూటీ. తాజాగా సొంతూరు చెన్నై వచ్చారు ఈ భామ. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీకి వచ్చారు సమంత.

అక్కడ స్టూడెంట్స్‌తో చాలాసేపు గడిపారు. గతేడాది కూడా ఫిబ్రవరిలోనే సత్యభామ యూనివర్సిటీకి వచ్చారు స్యామ్. అక్కడ విధ్యార్థులతో సినిమా ముచ్చట్లతో పాటు లైఫ్ లెసన్స్ కూడా చెప్పారు ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోనూ సినిమాలు చేయట్లేదు సమంత. కేవలం వెబ్ సిరీస్‌లపై ఫోకస్ చేసారీమె. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్‌లో కీలక పాత్రలో నటిస్తున్నారు.

దాంతో పాటు మరిన్ని సిరీస్‌లకి కథలు వింటున్నారు స్యామ్. ఈ గ్యాప్‌లోనే అప్పుడప్పుడూ అభిమానుల మధ్యలోకి వస్తున్నారు. ఏదేమైనా గ్యాప్ ఇచ్చినట్లు కనిపించినా.. పబ్లిక్ ఈవెంట్స్‌కు వస్తూ ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నారు సమంత.




