- Telugu News Photo Gallery Cinema photos Can You Guess The Actress In This Photo She Is Heroine Disha Patani
Tollywood : ఒక్క సినిమాతో హీరోలను వెనక్కు నెట్టింట హీరోయిన్.. అయినా అవకాశాలకు దూరమే..
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ హీరోయిన్ స్కూల్ డేస్ ఫోటో తెగ వైరలవుతుంది. అందులో చివరగా ఉన్న అమ్మాయి.. ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?
Updated on: Feb 18, 2025 | 2:17 PM

హిందీలో అనేక చిత్రాల్లో నటించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఇటీవల ఆమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఒక్క సినిమాతోనే స్టార్ హీరోలను సైతం వెనక్కు నెట్టింది. ఆమె నటించిన సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ దిశా పటానీ.

లక్నోలిని అమిటీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన దిశా పటానీ.. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ 2013లో రన్నరప్ గా నిలిచింది. 2015లో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఆ తర్వాత టైగర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాతో హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

హిందీలో అనేక చిత్రాల్లో నటించిన మెప్పించిన దిశా.. గతేడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోడిగా కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించింది. ఈసినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్యూటీకి మరింత గుర్తింపు వచ్చింది.




