- Telugu News Photo Gallery Cinema photos Director anil ravupudi revealed akkineni nagarjunas real name
అయ్యబాబోయ్..నాగార్జున అసలు పేరు ఇది కాదా..షాకింగ్ సీక్రెట్ రివీల్
అక్కినేని నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కవే. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా ఆయనకు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఆరుపదుల వయసులో కూడా మన్మథుడిలా కనిపిస్తూ.. అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు ఈ హీరో. కాగా, ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?
Updated on: Feb 18, 2025 | 12:32 PM

కింగ్ నాగార్జున అక్కినేని నాగేశ్వర్ రావు లెగసీని చెక్కు చెదరకుండా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఈయన చేసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సంచలనం సృష్టించాయి. మరీ ముఖ్యంగా నాగ్ కెరీర్‌లో శివ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ ఆ రోజుల్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఇక గతంతో పోలిస్తే ఈ హీరో కాస్త జోరు తగ్గించారనే చెప్పాలి. వెంకటేష్, బాలయ్య, చిరు వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోగా, ఈ హీరో మాత్రం బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తూ, బిజినెస్‌లు చేసుకుంటూ.. సినిమాల విషయంలో కాస్త వెనకడుగే వేస్తున్నారు అంటున్నారు తమ అభిమానులు.

బంగార్రాజు సినిమా తర్వాత ఈ హీరో చేసిన సినిమాలు తక్కువే, అంతేకాకుండా సరైన హిట్ కూడా లేదు. దీంతో అక్కినేని అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నాగార్జునకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. అది ఏమిటంటే? ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంక్రాంతి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావుపూడి నాగార్జునకు సంబంధించిన ఓ షాకింగ్ సీక్రెట్ రివీల్ చేశారు.

ఆయన మాట్లాడుతూ..నాగార్జున అసలు పేరు నాగార్జున కాదు. నాగార్జున సాగర్. కానీ సాగర్ కంటే నాగార్జున బాగుందని, క్యాచీగా నాగార్జున అనే ఫిక్స్ చేసుకున్నారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.