Hyderabad: కాఫీలు తాగారా.. టిఫినీలు చేశారా.. ఓర్నాయనో ఈ లేడీస్ ప్లాన్ చూస్తే కిర్రాకే..
ముస్లిం కుటుంబం వివాహ వేడుకలో బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు ప్రవేశించి, వేదిక నుండి ఎవరూ గుర్తించకుండా వెళ్లిపోయే ముందు పలువురు మహిళల పర్సులను దొంగిలించారు. అనంతరం మహిళా అతిథులు వారి పర్సు కోసం వెతకగా అవి కనిపించకపోవడంతో దొంగతనం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.

దొంగతనాలు చేయడంలో కొందరు ప్రబుద్ధులు కూడా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు.. ఏదైనా ఇంటిని దోచుకున్నామా.. లేదా ఎవరి దగ్గర నుంచైనా విలువైన వస్తువులు కాజేశామా..? కష్టపడి పని చేయకుండా తేరగా వచ్చేది ఉపయోగించుకుని.. లైఫ్ సెటిల్డ్.. అవ్వాలనేది వారి ఆలోచన.. అలా కొందరు వ్యక్తులు భయం లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు తరచుగా చూస్తున్నాం. తాజాగా జరిగిన సంఘటనలో లేడీస్.. దర్జాగా వచ్చి ఏకంగా పెళ్లి వేడుకలోనే చేతికి పనికి చెప్పారు.. దొరికింది దొరికినట్లు ఊడ్చుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్‌లోని మన్నత్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది.
నిన్న రాత్రి బండ్లగూడ ప్రాంతంలో ఉన్న మన్నత్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో ఒక పెళ్లికి సంబంధించిన దావత్ కార్యక్రమం జరిగింది. ఆ వేడుకకు వధువు, వరుడు బంధువులు హాజరయ్యారు.. వారంతా హడావిడిలో ఉన్నప్పుడు ఓ యువతితో కలిసి బురఖా వేసుకుని వచ్చిన మహిళ.. ఇదే అదను అనుకుని తన చేతికి పని చెప్పింది.. దావత్ కార్యక్రమానికి వచ్చిన అతిథులలో ఒకరి పర్స్ చోరీ చేసింది.. ఆ పర్స్‌లో రూ.60,000 నగద, ఒక మొబైల్ ఫోన్ ఉన్నట్లు సమాచారం.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వీడియో చూడండి..
ముస్లిం వివాహ వేడుకలో బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు ప్రవేశించి, వేదిక నుండి ఎవరూ గుర్తించకుండా వెళ్లిపోయే ముందు పలువురు మహిళల పర్సులను దొంగిలించారు. అనంతరం మహిళా అతిథులు వారి పర్సు కోసం వెతకగా అవి కనిపించకపోవడంతో దొంగతనం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఫంక్షన్ హాల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, బ్యాగులు, పర్సులు దొంగిలించడంలో ఇద్దరు మహిళలు పాల్గొన్నట్లు నిర్వాహకులు నిర్ధారించారు. సీసీటీవీ ఆధారాల ఆధారంగా బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే.. ఆ మహిళ శుభకార్యంలో వరువు కుటుంబసభ్యులకు వధువు బంధువుగా.. వధువు కుంబానికి వరుడి బంధువుగా నమ్మించి.. పర్సును మాయం చేసిందని స్థానికులు తెలిపారు. ఇటీవల ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో పెరిగినట్లు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
