పెళ్లి ఊరేగింపులో దారుణం..! గుర్రంపై ఊరేగుతూ కుప్పకూలిన వరుడు.. షాకింగ్ వీడియో వైరల్..
భారీ ఊరేగింపు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా, ఘనంగా నిర్వహించారు. పెళ్లి సందర్బంగా వరుడిని ఎంతో అందంగా ముస్తాబు చేసిన గుర్రంపై ఊరేగించారు. చుట్టాలు, స్నేహితులు, స్థానికులతో కలిసి వందలాది మంది ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. వరుడు కూడా చాలా సంతోషంగా గుర్రంపై ఎక్కి ఊరేగింపుకు బయలుదేరాడు. అంతలోనే ఎవరూ ఊహించని విదంగా ఒక షాకింగ్ సంఘటన జరిగింది.

పెళ్లి అంటే ఒక వేడుక. బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల ఇళ్లంతా హడావుడి నెలకొంటుంది. ఇక మనదేశంలో వివాహాలు మరింత అట్టహాసంగా, ఘనంగా జరుగుతాయి. ఇందుకు సంబంధించిన రకరకాల వీడియోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంటాయి. అలాగే, కొన్ని సందర్భాల్లో సంతోషకర సందర్భాల్లో విషాదం నిండిన వివాహా వార్తలు కూడా వినాల్సి వస్తుంది. పెళ్లి మండపం, వివాహా ఊరేగింపు ఉత్సవాల సమయంలో జరుగుతున్న కొన్ని దిగ్భ్రాంతికరమైన సంఘటనలు కూడా చూస్తుంటాం..అలాంటిదే ఓ షాకింగ్ ఉదాహరణ మధ్యప్రదేశ్‌లో జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ నగరంలో జరిగిన ఓ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఊరేగింపు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా, ఘనంగా నిర్వహించారు. పెళ్లి సందర్బంగా వరుడిని ఎంతో అందంగా ముస్తాబు చేసిన గుర్రంపై ఊరేగించారు. చుట్టాలు, స్నేహితులు, స్థానికులతో కలిసి వందలాది మంది ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. వరుడు కూడా చాలా సంతోషంగా గుర్రంపై ఎక్కి ఊరేగింపుకు బయలుదేరాడు. అంతలోనే ఎవరూ ఊహించని విదంగా ఒక షాకింగ్ సంఘటన జరిగింది. పెళ్లి ఊరేగింపులో ఉన్న వరుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో అతను అమాంతంగా గుర్రంపై నుండి కూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణం పోయింది. వరుడి మరణం వివాహ వేడుక జరుపుకుంటున్న వందలాది మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుర్రంపై ఊరేగింపుకు వెళ్తున్న వరుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడి మరణంతో సంబరాల్లో మునిగిపోయిన పెళ్లి ఇళ్లు కాస్త శోక సంద్రంగా మారింది. ఇరు కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.
ఇది కూడా చదవండి: మినీ బస్సుగా మారిన ఆటో..! ఏకంగా 18 మందిని ఎక్కించిన డ్రైవర్.. ఎలాగో మీరే చూడండి..
ఇది కూడా చదవండి: వీళ్ల రీల్స్ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్ పేలటంతో..
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..
ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?
ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్ చేసేయండిలా..
ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




