Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Battery: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 966కిలోమీటర్ల రేంజ్.. శామ్సంగ్ సరికొత్త బ్యాటరీ ఆవిష్కరణ

సియోల్ లో ఇటీవల జరిగిన ఎస్ఎన్ఈ బ్యాటరీ డే ఎగ్జిబిషన్‌లో సామ్సంగ్ తన సరికొత్త బ్యాటరీ సాంకేతికతను ప్రదర్శించింది. సాలిడ్ స్టేట్ బ్యాటరీల మొదటి బ్యాచ్ ను ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు పంపిణీ చేసినట్టు తెలిపింది. వాటిని సుమారు ఆరు నెలల పాటు పరీక్షించామని కూడా వెల్లడించింది. 

Samsung Battery: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 966కిలోమీటర్ల రేంజ్.. శామ్సంగ్ సరికొత్త బ్యాటరీ ఆవిష్కరణ
Samsung Solid State Battery
Madhu
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 29, 2024 | 6:11 PM

Share

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారులకు శామ్సంగ్ అధికపోయే శుభవార్త చెప్పింది. ఈ కంపెనీ అత్యంత సమర్థవంతమైన సాలిడ్ స్టేట్ బ్యాటరీ విడుదల చేయనుంది. దీనిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా  600 మైళ్ల రేంజ్ కలిగిన వాహనాలకు బాగా ఉపయోగపడుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు అధిక శక్తి సాంద్రత కలిగిన ఘన స్థితి బ్యాటరీని సామ్సంగ్ రూపొందిస్తుండంతో ఈవీ మార్కెట్ లో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది.

సియోల్ లో ప్రదర్శన

సియోల్ లో ఇటీవల జరిగిన ఎస్ఎన్ఈ బ్యాటరీ డే ఎగ్జిబిషన్‌లో సామ్సంగ్ తన సరికొత్త బ్యాటరీ సాంకేతికతను ప్రదర్శించింది. సాలిడ్ స్టేట్ బ్యాటరీల మొదటి బ్యాచ్ ను ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు పంపిణీ చేసినట్టు తెలిపింది. వాటిని సుమారు ఆరు నెలల పాటు పరీక్షించామని కూడా వెల్లడించింది.

సాలిడ్ స్టేట్ బ్యాటరీ

సామ్సంగ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ లపై ఈవీ తయారీదారులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇవి చిన్నవిగా, తేలికగా ఉండడంతో పాటు ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో వినియోగిస్తున్న వాటికంటే చాలా సురక్షితంగా ఉంటాయి. అయితే వీటిని ఉత్పత్తి చేయడం కూడా ఖరీదుతో కూడకూన్నదే. ఈ నేపథ్యంలో సాలిడ్ స్టేట్ బ్యాటరీలను మొదట సూపర్ ప్రీమియం ఈవీ విభాగంలోకి ఉపయోగిస్తారు. అంటే సింగిల్ చార్జిపై 600 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగల లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు వాడతారని తెలుస్తోంది.

మంచి పనితీరు

సామ్సంగ్ ఆక్సైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ సాంకేతికత చాలా బాగుంది. దాదాపు 500 డబ్ల్యూ/కేజీ శక్తి సాంద్రత కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మేజర్ ఈవీ బ్యాటరీల సాంద్రత కంటే ఇది దాదాపు రెట్టింపు. అవి ఇప్పటికే సింగిల్ చార్జిపై 300 మైళ్ల కంటే ఎక్కువ దూరం ఈవీలు ప్రయాణిస్తున్నాయి. కాబట్టి  సామ్సంగ్ ఆక్సైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ తో 600 మైళ్లు ప్రయాణించడం పెద్ద సమస్య కాదు. కానీ ఉత్పత్తి ఖర్చులే సమస్యగా మారుతాయి. కాగా.. టయోటా, సామ్సంగ్ రెండూ కంపెనీలూ 2027లో భారీ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపాయి. ముఖ్యంగా టయోాటా తన లెక్సస్ బ్రాండ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లలో ముందుగా వాటిని ఇన్‌స్టాల్ చేస్తామని తెలిపింది.

ఖరీదు ఎక్కువే..

అతి పెద్ద ఈవీ బ్యాటరీ సంస్థ సీఏటీఎల్ ప్రారంభంలో ఖరీదు సమస్యల కారణంగా సాలిడ్ స్టేట్ బ్యాటరీల యొక్క భారీ ఉత్పత్తిపై  సందేహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ 2030 వరకు సాధ్యం కాదని భావించింది. అయితే ఆ కంపెనీ ఇటీవల తన ఆలోచన మార్చుకుంది. 2027 నాటికి ఒక శాతం సాలిడ్-స్టేట్ బ్యాటరీ వ్యాప్తిని సాధించాలని యోచిస్తోంది.

మరికొన్ని ప్రణాళికలు

సామ్సంగ్ కంపెనీ సాలిడ్ స్టేట్ బ్యాటరీలతో పాటు చౌకైన లిథియం ఐరన్ ఫాస్ఫేట్,  కోబాల్ట్ రహిత బ్యాటరీలను అభివృద్ధి చేయనుంది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తన వాటాను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించింది. డ్రై ఎలక్ట్రోడ్ ఉత్పత్తి ప్రక్రియలను కూడా అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగా కేవలం 9 నిమిషాల్లో చార్జి చేయగల, 20 ఏళ్ల వరకూ పనిచేయగలిగే బ్యాటరీలను విడుదల చేయనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..