మనిషి చనిపోయే క్షణంలో మెదడులో ఏం జరుగుతుంది ??
మనిషి బతికున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. చనిపోయాక ఏం జరుగుతుందో.. ఆధ్యాత్మికవాదులు చెబుతారు. కానీ చనిపోయే క్షణంలో మనిషి మెదడులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? దీనికి సంబంధించి న్యూరో సైంటిస్టులు ఏం తెలుసుకున్నారు? అసలు ఈ విషయంలో ఇప్పటివరకు ఏమైనా పరిశోధనలు జరిగాయా? ఓ వ్యక్తి చిట్టచివరి క్షణాల్లో వారి మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది? కొన్నాళ్ల కిందటి వరకు ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.
మనిషి బతికున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. చనిపోయాక ఏం జరుగుతుందో.. ఆధ్యాత్మికవాదులు చెబుతారు. కానీ చనిపోయే క్షణంలో మనిషి మెదడులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? దీనికి సంబంధించి న్యూరో సైంటిస్టులు ఏం తెలుసుకున్నారు? అసలు ఈ విషయంలో ఇప్పటివరకు ఏమైనా పరిశోధనలు జరిగాయా? ఓ వ్యక్తి చిట్టచివరి క్షణాల్లో వారి మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది? కొన్నాళ్ల కిందటి వరకు ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. కానీ వైద్యరంగం అభివృద్ధి చెందుతున్న వేళ.. శాస్త్రవేత్తల పరిశోధనలు ఫలిస్తున్న వేళ.. వీటన్నింటికీ నెమ్మదిగా జవాబు దొరికే ఛాన్స్ పెరుగుతోంది. కొన్ని ప్రశ్నలకు సమాధానం రావడానికి లేటయ్యే అవకాశం ఉన్నా.. మరికొన్నింటి చిక్కుముడి ఇప్పుడిప్పుడే వీడుతోంది. కొందరు సైంటిస్టులు.. దాదాపు పదేళ్ల కిందట ఎలుకలపై పరిశోధన చేస్తున్నప్పుడు వాటి న్యూరో కెమికల్ ప్రాసెస్ ను గమనించారు. ఆ సమయంలో అవి చనిపోయాయి. అనుకోకుండా.. ఆ సమయంలో వాటి మైండ్ లో జరిగే మార్పులను గమనించడానికి శాస్త్రవేత్తలకు వీలు చిక్కింది. అప్పుడు ఓ ఎలుకలో సెరోటోనిన్ రసాయనం ఎక్కువగా విడుదల కావడాన్ని గమనించారు. సెరోటోనిన్ అనేది.. ఫీలింగ్స్ ను కంట్రోల్ చేస్తుంది. ప్రవర్తన, మూడ్, జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం, సంతోషం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర, ఆకలి.. ఇలాంటివాటిని రెగ్యులేట్ చేస్తుంది. ఒకవేళ దీని మోతాదు తగ్గితే.. డిప్రెషన్, యాంగ్జయిటీ.. ఇలా కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవు. అందుకే సెరోటోనిన్ ను ఫీల్ గుడ్ హార్మోన్ అని పిలుస్తారు. ఆ ఎలుకలో సెరోటోనిన్ అంతగా ఎందుకు రిలీజ్ అయ్యింది అన్న ప్రశ్న.. ఓ మంచి పరిశోధనకు దారితీసింది. మనిషి చనిపోతున్నప్పుడు తన మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయోగాన్ని కూడా కొనసాగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
గోంగూర తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..! లాభాలు తెలిస్తే అవాక్కే..
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

