గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి2 , విటమిన్ బి 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు రోజూవారీగా కావాల్సిన విటమిన్ సిలో 53 శాతం గోంగూరలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి, వారంలో రెండు సార్లైనా గోంగూర తింటే చాలా మంచిది.