Aadhar Update: ఆధార్ కార్డులో తప్పులున్నాయా.. ఇలా ఇంట్లో నుంచే ఈజీగా సరిచేసుకోండి..
మన ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఇతర వివరాలు తప్పులు లేకుండా, అక్షర దోషాలు లేకుండా ఉండాలి. అనుకోకుండా, పొరపాటును తప్పులు పడితే వెంటనే సరిచేసుకోవాలి. లేకపోతే లేనిపోని నష్టాలు కలుగుతాయి. ఆధార్ కార్డులో తప్పులను చాలా సులభంగా సరిచేసుకోవచ్చు. ఆన్ లైన్ లో అయితే ఈ పక్రియ వేగంగా పూర్తవుతుంది.

దేశంలో ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డు. ఇది దేశ పౌరుడుగా మీ గుర్తింపు సూచిస్తుంది. అలాగే మనం రోజు వారీ నిర్వహించే అనేక పనులకు అవసరమవుతుంది. ఆధార్ కార్డులో మీకు 12 అంకెల నంబర్ ను కేటాయిస్తారు. ఆ నంబరే మీకు గుర్తింపు అని చెప్పవచ్చు. ప్రథమంగా ఆధార్ కార్డు నివాస ధ్రువీకరణ పత్రంగా పనిచేస్తుంది. దేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అందజేస్తుంది. దీనిలో మీ పేరు, చిరునామా, బయోమెట్రిక్ , ఇతర వివరాలు నమోదు అవుతాయి.
వేరే ప్రాంతానికి మారితే..
దేశంలోని ప్రజలందరూ ఒకే చోట స్థిరంగా నివాసం ఉండరు. చదువు, ఉద్యోగం, వ్యాపారం తదితర వీటికోసం కొందరు సొంతూరిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లి స్థిర పడతారు. వీరందరూ తమ ఆధార్ కార్డులో చిరునామాను తప్పనిసరిగా మార్చుకోవాలి. సొంతూరి చిరునామాకు బదులు వారు స్థిర పడిన ప్రాంతం వివరాలు నమోదు చేసుకోవాలి. అప్పుడు వారికి ఆధార్ కార్డును అనుసరించి ప్రభుత్వం పథకాలు అందుతాయి.
తప్పులుంటే ఇబ్బందులే..
మన ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఇతర వివరాలు తప్పులు లేకుండా, అక్షర దోషాలు లేకుండా ఉండాలి. అనుకోకుండా, పొరపాటును తప్పులు పడితే వెంటనే సరిచేసుకోవాలి. లేకపోతే లేనిపోని నష్టాలు కలుగుతాయి. ఆధార్ కార్డులో తప్పులను చాలా సులభంగా సరిచేసుకోవచ్చు. ఆన్ లైన్ లో అయితే ఈ పక్రియ వేగంగా పూర్తవుతుంది.
చిరునామా మార్చే విధానం..
- ముందుగా ఆధార్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి, లాగిన్ అవ్వాలి.
- మీకు కొత్త పేజీ కనిపిస్తుంది. దానిని స్క్రోల్ చేసి, ఆధార్ అప్ డేట్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
- ఆధార్ అప్‌డేట్ ఆన్‌లైన్ అనే దానిని సెలెక్ట్ చేయండి.
- హౌ ఇట్స్ వర్క్ అనే పేజీ కనిపిస్తుంది. అక్కడ చూపిన అన్ని దశలను జాగ్రత్తగా పరిశీలించి, అడిగిన వివరాలు నమోదు చేయాలి.
- ఆ తర్వాత ప్రోసెస్ టు ఆధార్ అప్ డేట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. చిరునామాను మార్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఎంపికపై క్లిక్ చేయాలి.
- దానిలోని ప్రస్తుత చిరునాామా కనిపిస్తుంది. దాని కింద కనిపించిన డిటైల్స్ టుబీ అప్ డేటెడ్ సెక్షన్ లో మీ కొత్త చిరునామాను నమోదు చేయాలి.
- చిరునామా మార్పును ధ్రువీకరించే పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- అన్నీ పూర్తి చేసిన తర్వాత ‘తదుపరి’ని క్లిక్ చేయాలి. మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (ఎస్ఆర్ఎన్) వస్తుంది. దానిని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.
- చివరగా మీ ఆధార్ కార్డ్ చిరునామా మార్పు కోసం చార్జీగా రూ.50 చెల్లించాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..