WhatsApp: వాట్సాప్‌లో ఇక ఏఐ ఫొటోల సందడి.. మీ డీపీని ఏఐ తయారు చేస్తే ఎలా ఉంటుందో చూస్తారా?

వాట్సాప్ బీటా ఇన్ ఫో తెలిపిన సమాచారం ప్రకారం.. మెటా యాజమాన్యం నూతన ఏఐ ఫీచర్ ను డెవలప్ చేస్తోంది. దాని కోసం వినూత్న కార్యాచరణను చేపట్టింది. యూజర్ల వ్యక్తిత్వం, ఆసక్తులు, ఇష్టాలు, మానసిక స్థితికి అద్దం పట్టేలా చిత్రాలను ఏఐ ద్వారా రూపొందించనున్నారు. దీని ద్వారా త్వరలో ప్రత్యేకమైన ప్రొఫైల్ చిత్రాలు సందడి చేయనున్నాయి.

WhatsApp: వాట్సాప్‌లో ఇక ఏఐ ఫొటోల సందడి.. మీ డీపీని ఏఐ తయారు చేస్తే ఎలా ఉంటుందో చూస్తారా?
Whatsapp
Follow us

|

Updated on: May 26, 2024 | 6:57 AM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు శుభవార్త చెప్పింది. ఏఐ ఆధారిత ప్రొఫైల్ ఫొటోలను రూపొందించుకునేందుకు అనుగుణంగా నూతన ఫీచర్‌ను విడుదల చేయనుంది. ఇటీవల ఏఐ ఆధారిత స్టిక్కర్ల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ కూడా తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి సన్నాహాలు చేసుకుంది. కొత్త ఫీచర్ వినియోదారులకు మంచి అనుభవాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.

ప్రత్యేక ప్రొఫైల్ చిత్రాలు..

వాట్సాప్ బీటా ఇన్ ఫో తెలిపిన సమాచారం ప్రకారం.. మెటా యాజమాన్యం నూతన ఏఐ ఫీచర్ ను డెవలప్ చేస్తోంది. దాని కోసం వినూత్న కార్యాచరణను చేపట్టింది. యూజర్ల వ్యక్తిత్వం, ఆసక్తులు, ఇష్టాలు, మానసిక స్థితికి అద్దం పట్టేలా చిత్రాలను ఏఐ ద్వారా రూపొందించనున్నారు. దీని ద్వారా త్వరలో ప్రత్యేకమైన ప్రొఫైల్ చిత్రాలు సందడి చేయనున్నాయి.

ప్రయోజనాలు..

యూజర్ ఇంటరాక్షన్‌ను ఎలివేట్ చేయడం, మెరుగైన అనుభవం అందించడమే లక్ష్యంగా కొత్త ఫీచర్ ను రూపొందిస్తున్నారు. ఏఐ చిత్రాలతో యూజర్లకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రొఫైల్ లో తమ ఒరిజినల్ ఫొటోలను వాడాల్సిన అవసరం ఉండదు. అలాగే సృజనాత్మకంగా చిత్రాలను రూపొందించే సామర్థ్యం పెరుగుతుంది. ఇది ప్రొఫైల్ చిత్రాలకు ఆహ్లాదకరమైన అందాన్ని కలిగిస్తుంది.

నష్టాల నివారణకు..

ఆన్‌లైన్‌లో నిజమైన ఫోటోలను షేర్ చేయడం వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి ఏఐ ఆధారిత విధానం సహాయపడుతుంది. ఇదే దీని వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం అని చెప్పవచ్చు. యూజర్లు తమ గోప్యత గురించి ఆందోళన చెందే అవసరం ఉండదు. తమ ఒరిజినల్ ఫొటోలకు బదులు మంచి ప్రత్యామ్నాయంగా ఏఐ చిత్రాలు ఉపయోగపడతాయి. తద్వారా మీ ఫొటోలను బయటి వ్యక్తులు దుర్వినియోగం చేయకుండా నిరోధించవచ్చు.

రక్షణ వలయం..

వాట్సాప్ లోని ప్రొఫైల్ ఫొటోలను స్క్రీన్ షాట్ తీయడానికి నిరోధించే ఫీచర్ ఇప్పటికే కొనసాగుతోంది. దానికి నూతన ఏఐ ఫీచర్ అదనంగా ఉంటుంది. దీంతో మీ ఫొటోలకు, వ్యక్తిగత సమాచారాన్ని చక్కని రక్షణ లభిస్తుంది. త్వరలో జరిగే యాప్ అప్ డేట్ లో ఈ ఫీచర్ యాడ్ అవతుందని భావిస్తున్నారు.

మరో కొత్త ఫీచర్..

యాప్ ను తెరిచినప్పుడల్లా చదవని మెసేజ్ కౌంట్‌ను ఆటోమేటిక్‌గా క్లియర్ చేసే ఆప్షన్‌ను కూడా వాట్సాప్ తన వినియోగదారులకు అందించే అవకాశం ఉందని ఇటీవల నివేదికలు చెబుతున్నాయి. ఇది యూజర్లకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. వినియోగదారులు యాప్ ను ఓపెన్ చేసిన ప్రతిసారీ కొత్తగా ప్రారంభించవచ్చు, చదవని పాత మెసేజ్ లను చూసి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉండదు. వాటిని చూసి అయోమయానికి గురయ్యే బాధ తప్పుతుంది. కొత్త ఈ కొత్త ఫీచర్ తర్వాత వాట్సాప్‌ని తెరిచిన ప్రతిసారీ చదవని సందేశాల నోటిఫికేషన్లు కనిపించవు.

ఒత్తిడి లేకుండా..

వాట్సాప్ లోని కొన్ని అనవసర మెసేజ్ లను చదకుండానే వదిలేస్తాం. కానీ యాప్ తెరిచిన ప్రతిసారి ఆ నోటిఫికేషన్లు కనిపిస్తాయి. దీంతో కొత్తగా మెసేజ్ లు వచ్చాయేమోనని మనం మళ్లీ వాటిని ఓపెన్ చేస్తాం. కానీ అందులో పాతమే ఉంటాయి. కొత్త ఫీచర్ లో ఈ బాధలు ఉండదు. పాత మెసేజ్ ల నోటిఫికేషన్లు కనిపించవు. దృశ్య అయోమయాన్ని తగ్గించడం, యూజర్లకు మానసిక ఒత్తిడి లేకుండా చేయడం, తద్వారా కొత్త, ముఖ్యమైన కమ్యూనికేషన్లపై దృష్టి పెట్టేలా చేయడం ఈ ఫీచర్ ప్రధాన లక్ష్యం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!