AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asus Laptops: అసుస్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌లు.. బెస్ట్ క్వాలిటీ.. స్టైలిష్ డిజైన్..

ల్యాప్ ట్యాప్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. అసుస్ కంపెనీ నుంచి లేటెస్ట్ ఫీచర్లతో వివోబుక్ ఎస్ సిరీస్ ల్యాప్ టాప్‌లను విడుదల అయ్యాయి. ఇవి మూడు రకాల స్క్రీన్ పరిమాణాలలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు నచ్చిన విధంగా ఏఎమ్ డీ, ఇంటెల్ ప్రాసెసర్ల నుంచి ఎంపిక చేసుకోవచ్చు. మంచి నాణ్యత, మెరుగైన పనితీరు ల్యాప్ టాప్‌లు కావాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక.

Asus Laptops: అసుస్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌లు.. బెస్ట్ క్వాలిటీ.. స్టైలిష్ డిజైన్..
Asus Vivobook S Series Laptops
Madhu
|

Updated on: May 26, 2024 | 6:23 AM

Share

పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా ల్యాప్ టాప్‌ల వినియోగం బాగా పెరిగింది. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏ రంగంలోని అయినా వీటి వినియోగం ఎక్కువైంది. స్కూలు పిల్లల నుంచి ఉద్యోగులు, వ్యాపారుల వరకూ తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీల ల్యాప్ టాప్ లో మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. లేటెస్ట్ ఫీచర్లు, ప్రత్యేక క్వాలిటీతో ఆకట్టుకుంటున్నాయి.

అసుస్ వివో ల్యాప్ టాప్‌లు..

ల్యాప్ ట్యాప్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. అసుస్ కంపెనీ నుంచి లేటెస్ట్ ఫీచర్లతో వివోబుక్ ఎస్ సిరీస్ ల్యాప్ టాప్‌లను విడుదల అయ్యాయి. ఇవి మూడు రకాల స్క్రీన్ పరిమాణాలలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు నచ్చిన విధంగా ఏఎమ్ డీ, ఇంటెల్ ప్రాసెసర్ల నుంచి ఎంపిక చేసుకోవచ్చు. మంచి నాణ్యత, మెరుగైన పనితీరు ల్యాప్ టాప్‌లు కావాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక.

మూడు వేరియంట్లలో..

అసుస్ ల్యాప్ టాప్‌లు వీవోబుక్ ఎస్ 14, వీవోబుక్ ఎస్ 15, వీవీబుక్ ఎస్ 16 పేరుతో మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ఈ మూడు కొత్త మోడళ్లు ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ర్యామ్, ఆర్జీబీ బ్యాక్‌ లైటింగ్, లేటెస్ట్ జెన్ ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్లలో అందుబాటులోకి వచ్చాయి. వివిధ స్క్రీన్లు, హార్డ్‌వేర్ ఎంపికలను అందిస్తాయి.

ధరల వివరాలు..

  • ఎస్ 14 ల్యాప్ టాప్ న్యూట్రల్ బ్లాక్ కలర్‌లో వస్తుంది. దీని ధర రూ. 89,990.
  • ఎస్ 15 ల్యాప్ టాప్ మిస్ట్ బ్లూ, న్యూట్రల్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది, దీని ధర రూ.96,990.
  • ఎస్ 16 కూడా మిస్ట్ బ్లూ, న్యూట్రల్ బ్లాక్ లో లభిస్తుంది. రూ.1,02,990లకు అందుబాటులో ఉంది.

ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో కొనుగోళ్లు..

అసుస్ కంపెనీ ఇ-షాప్‌తో పాటు వివిధ ఛానెళ్ల ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి. అలాగే అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, క్రోమా తదితర వాటి నుంచి ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

ఫీచర్లు ఇవే..

వీవోబుక్ ఎస్ 14 ల్యాప్ టాప్.. ఏఎండీ రైజెన్ ప్రాసెసర్‌ కలిగిన ఈ ల్యాప్ టాప్ బరువు 1.30 కేజీలు మాత్రమే. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ పై పనిచేస్తుంది. దీనిని ఎక్కడినైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. అసుస్ లుమినా ఓఎల్ఈడీ డిస్ల్ ప్లే తో విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. మెరుగైన వీడియో కాలింగ్ కోసం ఏఐ సెన్స్ కెమెరా అమర్చారు. ఆర్జీబీ బ్యాక్‌ లైటింగ్‌తో కూడిన ఎర్గోనామిక్ కీబోర్డ్, హెచ్ డీఎమ్ఐ 2.1, యూఎస్ బీ – సీ 3.2 జెన్ 1తో సహా వివిధ కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌లోని ఆడియో సిస్టమ్ మంచి సౌండ్ క్వాలిటీ ఇస్తుంది. దీనికి డాల్బీ అట్మోస్ సర్టిఫికెట్ ఉంది.

వీవోబుక్ ఎస్ 15 ల్యాప్ టాప్.. ఈ ల్యాప్ టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 16 జీబీ ర్యామ్ తో పాటు హై స్పీడ్ పనితీరు కోసం 1 టీబీ పీసీఐఈ 4.0 ఎస్ఎస్డీ ఏర్పాటు చేశారు. 15.5 అంగుళాల 3కే ఓఎల్ఈడీ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, యాంటీ మైక్రోబయల్ గార్డ్ ప్రొటెక్షన్, థండర్‌ బోల్ట్ 4 పోర్ట్‌ తదితర ప్రత్యేకలు ఉన్నాయి. దీనిలోని ఐస్ కూల్ థర్మల్ టెక్నాలజీ కారణంగా ల్యాప్ టాప్ ను ఎంత సేపు ఉపయోగించినా వేడెక్కకుండా ఉంటుంది. కోపిలట్ కీ, పెద్ద టచ్‌ప్యాడ్, విండోస్ హలో ఫేషియల్ లాగిన్‌తో కూడిన ఎగ్రో సెన్స్ కీబోర్డ్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ బరువు 1.50 కేజీలు. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.

వీవోబుక్ ఎస్ 16 ల్యాప్ టాప్.. ఈ ల్యాప్ టాప్ లో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌, 16 జీబీ ర్యామ్, 1 టీబీ పీసీఐసీ 4.0 ఎస్ఎస్డీ తదితర వాటిని అమర్చారు. ఎస్ 15 లో మాదిరిగానే దీనిలో కూడా ఐస్ కూల్ థర్మల్ టెక్నాలజీ ఉంది. 16 అంగుళాల 3.2 కే ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ఆల్ మెటల్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఆర్జీబీ బ్యాక్‌ లైటింగ్, పెద్ద టచ్‌ప్యాడ్, థండర్‌ బోల్ట్ పోర్ట్‌లు, హెచ్ డీఎమ్ఐ 2.1, యూఎస్బీ -సీ టైప్ ఛార్జ్‌తో కూడిన ఎగ్రోసెన్స్ కీబోర్డ్‌ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీని బరువు 1.50 కేజీలు మరియు విండోస్ 11 హోమ్ ఓఎస్‌తో నడుస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..