AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోటరోలా నుంచి అదిరిపోయే బడ్జెట్‌ ఫోన్‌! దీపావళి సేల్‌లో మరింత తక్కువ ధరకు.. ఫీచర్లు ఇవే!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ దీపావళి సేల్‌లో మోటరోలా G96 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. రూ.5,000 తగ్గింపుతో ప్రారంభ ధర రూ.15,999. అదనంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ సౌకర్యం కూడా ఉన్నాయి. 8GB RAM, 5500mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, OIS కెమెరా, IP68 రేటింగ్‌తో ఈ మిడ్-రేంజ్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది.

మోటరోలా నుంచి అదిరిపోయే బడ్జెట్‌ ఫోన్‌! దీపావళి సేల్‌లో మరింత తక్కువ ధరకు.. ఫీచర్లు ఇవే!
Motorola G96 5g
SN Pasha
|

Updated on: Oct 13, 2025 | 6:11 PM

Share

ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ దీపావళికి మీలో ఎవరైనా ఫోన్‌ కొనాలనుకుంటుంటే.. ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి. అదే మోటరోలా G96. ఈ ఫోన్ ఈ సంవత్సరం జూలైలో 8GB RAM, 256GB స్టోరేజ్‌తో విడుదల అయింది. ఇది పవర్‌ఫుల్‌ 5,500mAh బ్యాటరీ, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. గత సంవత్సరం విడుదలైన మోటరోలా G85 5Gకి బదులుగా మోటరోలా ఈ ఫోన్‌ను G సిరీస్‌లో ప్రవేశపెట్టింది. హార్డ్‌వేర్, కెమెరా రెండింటినీ అప్‌గ్రేడ్ చేసింది.

డిస్కౌంట్

ఈ మోటరోలా ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది: 8GB RAM + 128GB, 8GB RAM + 256GB. దీని ప్రారంభ ధర రూ.20,999 కాగా, దీని టాప్ వేరియంట్ ధర రూ.22,999. ఇది ఆష్లీ బ్లూ, డ్రెస్డెన్ బ్లూ, ఆర్చిడ్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ సేల్ సమయంలో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999 ప్రారంభ ధరకు లిస్ట్ అయింది. దీని ధర రూ.5,000. అదనంగా SBI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేసినప్పుడు ఫ్లిప్‌కార్ట్ రూ.1,000 తగ్గింపును అందిస్తోంది.

ఇంకా మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్ ధరను మరింత తగ్గుతుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.3,000 ధర లభిస్తే, మీరు రూ.12,000లకే కొత్త మోటరోలా G96ని సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత ఫోన్‌కు ఎక్స్‌ఛేంజ్‌లో ఎంత వస్తుందనేది ఆ ఫోన్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.

మోటరోలా G96 5G ఫీచర్లు

  • ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD+ 10-బిట్ 3D కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో వాటర్‌డ్రాప్-స్టైల్ టచ్‌స్క్రీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉన్నాయి.
  • Moto G96 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, 8GB RAM, 256GB వరకు అంతర్గత నిల్వతో జత చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హలో UIపై నడుస్తుంది. కంపెనీ మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్‌లు అందిస్తోంది.
  • ఈ సరసమైన మోటరోలా ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో 50MP సోనీ లిటియా 700C ప్రధాన కెమెరా ఉంది, ఇది OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) కు మద్దతు ఇస్తుంది. 8MP సెకండరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఇది 32MP ముందు కెమెరాను కలిగి ఉంది.
  • ఈ ఫోన్ శక్తివంతమైన 5,500mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అమర్చబడి ఉంది. దీనికి IP68 రేటింగ్ కూడా ఉంది, ఇది ఫోన్ నీరు, ధూళి నష్టాన్ని తట్టుకునేలా చేస్తుంది. భద్రత కోసం, ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. అదనంగా ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. డాల్బీ అట్మోస్‌కు మద్దతు ఇస్తుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా