AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon musk: మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్.. మస్క్ కొత్త ఐడియా సూపర్!

కొత్త కొత్త టెక్నాలజీలపై వర్క్ చేసే ఎలన్ మస్క్ గత కొంతకాలం నుంచి ఓ సరికొత్త ఏఐ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నాడు. అదే మాక్రోహార్డ్. మైక్రోసాఫ్ట్ కి పోటీగా మస్క్ దీన్ని తీసుకురానున్నాడు. అందుకే పేరు కూడా మైక్రో సాఫ్ట్ కు రివర్స్ లో మాక్రో హార్డ్ అని పెట్టాడు. అసలేంటీ మాక్రో హార్డ్.. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Elon musk: మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్.. మస్క్ కొత్త ఐడియా సూపర్!
Elon Musk Macrohard
Nikhil
|

Updated on: Oct 14, 2025 | 1:30 PM

Share

ఎలన్ మస్క్ రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ పేరు మాదిరిగా అనిపించే ‘మాక్రోహార్డ్’ అనే పేరును తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు అదే మాక్రో హార్డ్ కు సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చాడు. కంపెనీ బిల్డింగ్ ఫొటో పెట్టి లోగో కంప్లీట్ అని ట్వీ్ట్ చేశాడు. ఈ కంపెనీ పూర్తిగా ఏఐతో పని చేసే హార్డ్ వేర్ కంపెనీ. ఇది టెక్ ప్రపంచంలో ఎలాంటి మార్పులు తీసుకురానుంది అంటే..

ఏఐ హార్డ్‌వేర్

మాక్రోహార్డ్ అనేది పూర్తిగా ఏఐ బేస్డ్ హార్డ్ వేర్ కంపెనీ. ఇందులో ఏఐ టూల్స్ ద్వారానే హార్డ్ వేర్ విభాగాలు తయారుచేస్తారు. దీని గురించి గతంలో మస్క్ కొన్ని విషయాలు చెప్పాడు. మాక్రోహార్డ్ అనేది పూర్తిగా ఏఐ సాఫ్ట్‌వేర్ కంపెనీ అని మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు స్వయంగా ఎటువంటి ఫిజికల్ హార్డ్‌వేర్‌ను తయారు చేయలేవని,  కానీ వాటిని పూర్తిగా ఏఐతో సృష్టించడం సాధ్యమవుతుందని గతంలో మస్క్ ట్వీట్ చేశాడు.

వర్చువల్ మెషీన్లతో..

మాక్రోహార్డ్ అనేది మైక్రోసాఫ్ట్ కు పోటీగా భిన్నమైన టెక్నాలజీతో డెవలప్ చేస్తున్న కంపెనీ అని చెప్పుకోవచ్చు. మాక్రోహార్డ్ కంపెనీలో ఏఐను ఉపయోగించి వీడియో గేమ్స్, కోడింగ్, రన్నింగ్, కొన్ని కంప్యూటర్ సాఫ్ట్‌వేర్స్ వంటివి  డెవలప్ చేస్తారు. ఈ కంపెనీలో మనుషులకు బదులు వర్చువల్ మెషీన్లు పని చేస్తాయి. అవి సాఫ్ట్‌వేర్‌తో కమ్యూనికేట్ చేస్తూ మనిషి లాగా టాస్క్ లు పూర్తి చేస్తాయి.

మైక్రోసాఫ్ట్‌తో పొటీ

ఇకపోతే గత కొన్నేళ్లుగా సందర్భం వచ్చిన ప్రతిసారీ మస్క్.. మైక్రోసాఫ్ట్ ను  విమర్శిస్తూనే ఉన్నాడు. గతంలో కూడా మైక్రోసాఫ్ట్‌ అనుబంధ సంస్థ అయిన ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ-5 మోడల్‌ సమర్థవంతంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తే.. దానికి స్పందిస్తూ ఎలన్‌ మస్క్‌ త్వరలో ఓపెన్‌ఏఐ మైక్రోసాఫ్ట్‌ను నాశనం చేస్తుందని చెప్పారు. మరి ఈ పోటీ ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.