Whatsapp spam: వాట్సాప్‌లో స్పామ్ మెసేజ్‌లు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చేయండి చాలు!
వాట్సాప్‌లో స్పామ్ మెసేజెస్/ కాల్స్ చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి స్పామ్ కాల్స్ ద్వారా రకరకాల సైబర్ మోసాలకు అవకాశం ఉంటుంది. అయితే వీటిని అరికట్టడానికి వాట్సాప్ లో కొన్ని ప్రైవసీ ఫీచర్స్ ఉన్నాయి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను డీఫాల్ట్‌గా సైలెంట్ చేసేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అదెలాగంటే..

వాట్సాప్‌లో వచ్చే స్పామ్ కాల్స్ లేదా మెసేజెస్ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే మీరు వాట్సాప్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా వాటికి అడ్డుకట్ట వేయొచ్చు. స్పామ్ మెసేజెస్‌ను అలాగే వదిలేస్తే.. అవి మరింత ఎక్కువ అవ్వడమే కాకుండా కొన్నిసార్లు తెలియకుండా మోసాల బారిన పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తెలియని వాళ్లు కూడా వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తుంటారు. ఇలాంటి స్పామ్ ను ఎలా అరికట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాల్స్ రాకుండా..
ముందుగా వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకుని.. తర్వాత సెటింగ్స్‌లో ప్రైవసీలోకి వెళ్తే కాల్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సైలెన్స్ అన్‌నోన్ కాలర్’ ఫీచర్ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే తెలియనివారి నుంచి వచ్చే కాల్స్ కేవలం లాగ్స్‌లో మాత్రమే కనిపిస్తాయి, రింగ్ అవ్వవు.
గ్రూపుల్లో చేర్చకుండా..
ఇకపోతే ‘చూజ్ హూ కెన్ కాంటాక్ట్ యూ’ అనే ప్రైవసీ ఫీచర్ ద్వారా మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో చేర్చకుండా అడ్డుకోవచ్చు. అలాగే ‘కంట్రోల్ యువర్ పర్సనల్ ఇన్ఫో’ అనే ఆప్షన్‌తో ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్ స్టేటస్, రీడ్ రిసీప్ట్స్‌ను ఎవరెవరు చూడవచ్చో సెట్ చేసుకోవచ్చు.
హ్యాక్ చేయకుండా..
ఇకపోతే ‘యాడ్ మోర్ ప్రైవసీ టు యువర్ చాట్స్’ ఆప్షన్ ద్వారా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్స్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ‘యాడ్ మోర్ ప్రొటెక్షన్ టు యువర్ అకౌంట్’ సెట్టింగ్ ద్వారా వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. వాట్సప్ డేటా హ్యాక్ అవ్వకుండా ఈ ఫీచర్ అడ్డుకుంటుంది. అలాగే పర్సనల్ వాట్సాప్ చాట్స్ ఎవరికి కనిపించకుండా హిడెన్ అండ్ లాక్ చాట్స్ ఆప్షన్ కూడా వాట్సాప్ లో ఉన్నాయి. వీటిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ లో మీ ప్రైవసీ సేఫ్ గా ఉంటుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




