AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్ఫినిక్స్ నుంచి మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌.. దీని ప్రత్యేకతలు తెలిస్తే.. అస్సలు వదలరు!

వినియోగదారుల అభిరుచులకు అనుగునంగా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ ఫోన్‌లను అప్‌గ్రేడ్‌ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తూనే ఉంటాయి. తాజాగా ఇన్‌ఫినిక్స్‌ కూడా తన ప్రత్యేకమైన ఇన్ఫినిక్స్‌ హాట్ 60i 5G ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ప్రత్యేకత ఏంటంటే.. ఇది తక్కువ నెట్‌వర్క్‌ ఉన్న ప్రదేశంలో కూడా మీ కాల్స్‌కు ఎలాంటి అంతరాయాలు లేకుండా చూస్తుందట. అయితే ఈ ఫోన్‌ ధర ఎంత, మిగతా స్పెసిఫికేషన్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ఫినిక్స్ నుంచి మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌.. దీని ప్రత్యేకతలు తెలిస్తే.. అస్సలు వదలరు!
Infinix Hot 60i 5g
Anand T
|

Updated on: Aug 18, 2025 | 8:48 PM

Share

ప్రముఖ ఇన్ఫినిక్స్ కంపెనీ తన బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ప్రారంభ ధరను కేవలం రూ. 9,299గానే కంపెనీ ప్రకటించింది. ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G ఫోన్ ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది తక్కువ నెట్‌వర్క్‌ ఉన్న ప్రదేశంలో కూడా మీ కాల్స్‌కు ఎలాంటి అంతరాయాలు లేకుండా చూస్తుందట. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి అనేక బలమైన లక్షణాలను కలిగి ఉంది. ఈ చౌకైన ఫోన్‌లో, కంపెనీ ప్రత్యేకమైన కెమెరా డిజైన్‌ను ఇచ్చింది. దాని ధర, లక్షణాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G ధర

ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ 4GB RAM + 128GB సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. ఫోన్ స్టోరేజ్, RAM ను మనం విస్తరించవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ. 9,299 గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. మొదటి సేల్‌లో, ప్రీపెయిడ్ చెల్లింపుపై రూ. 300 తగ్గింపు ఇవ్వబడుతోంది. ఈ విధంగా, ఈ ఫోన్‌ను రూ. 9,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు దారులకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ ఫోన్‌ను షాడో బ్లూ, మాన్‌సూన్ గ్రీన్, ప్లం రెడ్, స్లీక్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: ఆండ్రాయిడ్ కేబుల్‌తో ఐఫోన్ ఛార్జ్ చేస్తున్నారా?.. ఇక మీ ఫోన్‌ షెడ్డుకే.. ఎందుకంటే?

ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G ఫీచర్లు

Infinix Hot 60i 5G అల్ట్రా లింక్ టెక్నాలజీతో నెట్‌వర్క్-ఫ్రీ కాలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్ ద్వారా, మీరు నెట్‌వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా మీ ఫోన్ నుండి కాల్స్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఇంటి లోపల, బేస్‌మెంట్‌లు, ఫోన్ నెట్‌వర్క్ చాలా లోగా ఉన్న ప్రాంతాలలో, మీరు దీని ద్వారా కాల్స్ చేయగలుగుతారు. ఈ ఫోన్ 6.75-అంగుళాల HD + LCD డిస్ప్లేతో వస్తుంది, ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు కలిగి ఉంది. ఫోన్ డిస్ప్లే బ్రైట్‌నెస్‌ 670 నిట్‌ల వరకు ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇది 4GB LPDDR4x RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఆ డేట్‌ను ఫిక్స్‌ చేసి పెట్టుకోండి.. ఐఫోన్ 17 సిరీస్‌ రాబోతుంది!

ఇన్ఫినిక్స్ నుండి వచ్చిన ఈ చౌకైన ఫోన్‌లో శక్తివంతమైన 6000mAh బ్యాటరీని కలిగి ఉంది, అంతేకాకుండా ఇందులో 18W ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఇవ్వబడింది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా XOS 15 పై నడుస్తుంది, దీనిలో అనేక AI ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP మేన్ కెమెరా ఉంటుంది. దానితో పాటు 5MP ఫ్రెంట్‌ కెమెరా ఉంటుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.