మరో అద్భుతం.. ఇకపై రోబోలతో పిల్లల్ని కనొచ్చు!
పూటకో చోట అక్రమ ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. ఐవీఎఫ్ సెంటర్ల పేరుతో, సరోగసి పేరుతో పిల్లల్లేని దంపతులను ముఠాలు నిండా ముంచుతున్న వేళ ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదే ప్రెగ్నెన్సీ రోబో.. యస్ మిరు వింటున్నది నిజమే.. రోబోలతో పిల్లల్ని కనే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ఇది అచ్చం రోబో సినిమా స్టోరీలా అనిపించినా ముమ్మాటికీ నిజం.
సాంకేతిక రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టే చైనాలో ఈ అద్భుతం అవిష్కృతం కాబోతుంది. సాధారణంగా పిల్లలు కనడంలో ఇబ్బంది ఉన్న భార్యాభర్తలు సరోగసిని ఆశ్రయిస్తూ ఉంటారు. భార్యాభర్తల నుంచి శుక్రకణాలు, అండాలను సేకరించి వేరే మహిళ గర్భం ద్వారా పిల్లలను కనేలా చేస్తారు. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇండియా వంటి దేశాల్లో సరోగసి నిషేధం. చైనా ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం సరోగసి కోసం వేరే మహిళలు అవసరం లేదు. రోబోలే మనుషుల పిల్లల్ని కంటాయి. చైనాకు చెందిన కైవా టెక్నాలజీ ఈ అద్భుత సృష్టికి తెరతీసింది. రోబోలు మనుషుల పిల్లల్ని ఎలా కంటాయన్న అనుమానం అక్కర్లేదు. ఆ రోబోల్లో కృత్తిమ గర్భాశయాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో అండం వృద్ధి చెందుతుంది. 9 నెలల తర్వాత బయటకు వస్తుంది. రోబో గర్భంలో బిడ్డ పెరుగుతున్నంత వరకు పైపు ద్వారా పోషకాలను అందిస్తారు. ఈ ప్రోటోటైప్ వచ్చే ఏడాది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రెగ్నెన్సీ రోబోల ధర లక్ష యూవాన్లు. అదే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 11 లక్షల రూపాయలుపైనే ఉంటుంది. కృత్తిమ గర్భాశయం తయారీ ఇప్పటికే పూర్తయింది. దాన్ని రోబో కడుపులో అమర్చి పరీక్ష చేయటం మాత్రమే బాకీ ఉంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వ అనుమతులు వస్తే మాత్రం ఇకపై మనుషులు, రోబోలు కలిసి పిల్లల్ని కనొచ్చన్నమాట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ షాక్.. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారిపై అధిక ప్రభావం
రోజుకు రూ.45 పెట్టుబడి పెడితే.. చేతికి రూ.25లక్షలు ఎల్ఐసీలో బెస్ట్ పాలసీ!
ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు అనూహ్య స్పందన..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

