హమ్మయ్య .. చిరుత బోనులో చిక్కింది.. ఎక్కడంటే..
తిరుపతిలోని యూనివర్సిటీ ప్రాంతాలను భయపెడుతున్న చిరుతల సంచారం పై అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిరుత చిక్కింది. గత కొన్ని నెలలుగా శేషాచలం కొండల నుంచి బయటకు వస్తున్న చిరుతలు యూనివర్సిటీ లోని విద్యార్థులను సిబ్బందిని, జూ పార్క్ రోడ్ లో వాహనదారులను భయపెడుతున్నాయి.
తిరుపతిలోని యూనివర్సిటీ ప్రాంతాలను భయపెడుతున్న చిరుతల సంచారం పై అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిరుత చిక్కింది. గత కొన్ని నెలలుగా శేషాచలం కొండల నుంచి బయటకు వస్తున్న చిరుతలు యూనివర్సిటీ లోని విద్యార్థులను సిబ్బందిని, జూ పార్క్ రోడ్ లో వాహనదారులను భయపెడుతున్నాయి. చిరుతల సంచారం స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న పరిస్థితి నెలకొనడంతో అటవీ శాఖ చిరుతలను బంధించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ట్రాప్ కెమెరాలను, బోన్లను ఏర్పాటు చేసింది. ఈమధ్య కాలంలోనే ఎస్ వి వేదిక్ యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన బోన్ లో ఒక చిరుత చిక్కగా పక్కనే ఉన్న తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. యూనివర్సిటీ లైబ్రరీ వెనుక వైపు ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడింది. గత రెండు వారాలుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీశాఖ ఎర వేసి బోను ఏర్పాటు చేసింది. ఆదివారం రాత్రి యధావిధిగానే ఆ ప్రాంతానికి వచ్చిన చిరుత బోనులో చిక్కుకుంది. బోనులో బంధించిన మగ చిరుత వయసు 5 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్న అటవీ శాఖ అధికారులు ఆరోగ్యంగా ఉండడంతో చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెప్పిన పనులు చేసే రోబో జస్ట్ రూ. 5 లక్షలే..
సమోసా ఇండియాలో పుట్టిందా? కానే కాదు.. ఆ దేశంలో పుట్టి.. ఇక్కడికి..!
అన్నం పెడితే చాలు వాంతులు చేసుకుంటున్న చిన్నారి.. వైద్యులు టెస్టులు చేయగా
రాత్రి 7 గంటలలోపు భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా
Gold Rate Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా?
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

