సమోసా ఇండియాలో పుట్టిందా? కానే కాదు.. ఆ దేశంలో పుట్టి.. ఇక్కడికి..!
సమోసాలను మనమే కాదు ప్రపంచ వ్యాప్తంగా లొట్టలేసుకుంటూ తింటారు. ఈ త్రిభుజాకార పేస్ట్రీలు బంగాళా దుంపలు, మాంసం, కూరగాయలతో వివిధ రకాలుగా తయారుచేస్తారు. అయితే, ఈ సమోసాలు ఎక్కడ పుట్టాయి. ఇండియాకు ఎప్పుడు వచ్చాయి? ఇక్కడ ఎలా పాపులర్ అయ్యాయి? సమోసాలు 10వ శతాబ్దంలో మిడిల్ ఈస్ట్ లో పుట్టి ఉండవచ్చని చాలా మంది పరిశోధకులు భావిస్తున్నారు.
సమోసాలను మనమే కాదు ప్రపంచ వ్యాప్తంగా లొట్టలేసుకుంటూ తింటారు. ఈ త్రిభుజాకార పేస్ట్రీలు బంగాళా దుంపలు, మాంసం, కూరగాయలతో వివిధ రకాలుగా తయారుచేస్తారు. అయితే, ఈ సమోసాలు ఎక్కడ పుట్టాయి. ఇండియాకు ఎప్పుడు వచ్చాయి? ఇక్కడ ఎలా పాపులర్ అయ్యాయి? సమోసాలు 10వ శతాబ్దంలో మిడిల్ ఈస్ట్ లో పుట్టి ఉండవచ్చని చాలా మంది పరిశోధకులు భావిస్తున్నారు. పురాతన పర్షియన్ రచనలలో ‘సంబుసాక్’ గురించి ప్రస్తావించారు. ఇది మాంసం, కూరగాయలు లాంటి వాటితో నిండిన త్రిభుజాకార పేస్ట్రీ. వీటిని ఇప్పటి సమోసాల మాదిరిగానే తయారు చేసేవారు. 13వ లేదా 14వ శతాబ్దంలో వ్యాపారులు, ప్రయాణికులు సమోసాలను భారతదేశానికి తీసుకొచ్చారు. ప్రముఖ వాణిజ్య మార్గం సిల్క్ రోడ్ వెంబడి చాలా మంది ప్రయాణించే వారు. అలా వారి ద్వారా ఈ ఫుడ్ గురించి భారతీయులకు తెలిసింది. ఆ తర్వాత స్థానికంగానే ప్రజలు సమోసాలను తమదైన రీతిలో తయారు చేసుకోవడం ప్రారంభించారు. బంగాళాదుంపలు, బఠానీలు, చికెన్ లేదంటే మాంసం కూరను అందులో పెట్టి, తయారు చేశారు. ఈ పదార్థాలు సమోసాను మరింత రుచికరంగా మార్చాయి. ‘సమోసా’ అనే పదం పర్షియన్ పదం ‘సాన్ బోసాగ్’ నుంచి వచ్చింది. తర్వాత ప్రజలు దీనిని సమోసా అని పిలవడం ప్రారంభించారు. ఆ పేరు అలాగే నిలిచిపోయింది. ఇప్పుడు దీనిని చాలా దేశాలలో సమోసా పేరుతోనే పిలుస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అన్నం పెడితే చాలు వాంతులు చేసుకుంటున్న చిన్నారి.. వైద్యులు టెస్టులు చేయగా
రాత్రి 7 గంటలలోపు భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా
Gold Rate Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా?
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

