రాత్రి 7 గంటలలోపు భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడమే కాదు.. అది సమయానికి తీసుకోవడం కూడా చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఇదంతా మంచిదే.. కానీ తీసుకునే ఆహారం సమయానికి తీసుకుంటున్నారా? ఏ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలో తెలుసా? నిపుణుల ప్రకారం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రాత్రి భోజనాన్ని సాయంత్రం 7 గంటల లోపు పూర్తి చేసేయాలి.
ఎందుకంటే మన శరీరం రాత్రివేళ అతి స్వల్పంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిగా మారుతుంది. దీని వల్ల అప్పుడు తీసుకునే ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోతే అసిడిటీ, వాంతులు, వాయువు, లేదా పొట్ట నొప్పులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా అధిక మోతాదులో ఆహారం తీసుకుంటే రాత్రి నిద్రకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల శరీరం రిఫ్రెష్ కాకుండా, అలసటగా మారి, మరుసటి రోజున కూడా పూర్తిగా చురుకుగా ఉండలేనంతగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రాత్రివేళ మన శరీరంలో మెటబాలిజం మందగించడంతో ఆలస్యంగా తీసుకునే ఆహారంలోని కాలరీలు పూర్తిగా ఖర్చవకుండా, కొవ్వు రూపంలో పేరుకుపోయే అవకాశముంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే శరీరభారం పెరిగే ప్రమాదం ఉంటుంది. రాత్రి భోజన సమయం, రక్తంలో షుగర్ స్థాయి మధ్యన గట్టి సంబంధం ఉంటుంది. తరచూ రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తే, శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం ద్వారా మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదు, రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీని వల్ల బీపీ , కోలెస్ట్రాల్ స్థాయి వంటి అంశాలు విరుద్ధంగా మారతాయి. అందువల్ల, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. రాత్రి భోజనాన్ని సాయంత్రం 7 గంటల లోపు పూర్తిచేయడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట తేలికపాటి త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలంటున్నారు. భోజనం తరువాత తక్కువగా నీరు తీసుకుంటూ, కొంత నడవడం శ్రేయస్కరం. ఇలాంటి నియమాలు పాటిస్తే మధుమేహం, గుండెపోటు, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Rate Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా?
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

