AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వణికించిన తుఫాను.. గంటకు 260 కి.మీ వేగంతో గాలులు

వణికించిన తుఫాను.. గంటకు 260 కి.మీ వేగంతో గాలులు

Phani CH
|

Updated on: Aug 18, 2025 | 5:59 PM

Share

భూమిపై ఉన్న అతి పెద్ద మహాసముద్రాలలో అట్లాంటిక్ మహాసముద్రం రెండవది. ప్రస్తుతం అందులో సంభవించిన ఓ తుఫాను తీవ్రతను చూసి వాతావరణ వాస్త్రవేత్తలు షాకవుతున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ తుఫాను కేవలం 24 గంటల్లోనే కేటగిరీ-1 నుండి కేటగిరీ-5కి మారింది. ఆగస్టు 15 ఉదయం ఆ తుఫాను వేగం వేగం 75 మైల్స్ పర్ అవర్‌గా ఉండగా, శనివారం నాటికి అది 160 mph అంటే గంటకు సుమారు 260 కిలో మీటర్లు వేగాన్ని చేరుకుంది.

ఇప్పటివరకు సంభవించిన అత్యంత వేగవంతమైన తుఫాన్‌గా ఇది రికార్డులకె క్కింది.కాగా, ఇది వాతావరణ మార్పు, సముద్ర ఉష్ణోగ్రత పెరుగుదల మూలంగా ఇంతటి శక్తివంతమైన తుఫానుగా ఇది మారిందని నిపుణులు అంటున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు అంగుయిలాకు ఉత్తరాన 170 కిలోమీటర్ల దూరంలో హరికేన్ కేంద్రీకృతమై, గంటకు 28 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా సాగింది. తుఫాను కేంద్రం సముద్రంలోనే ఉండి, ప్యూర్టో రికో మరియు వర్జిన్ దీవులకు ఉత్తరాన వెళుతుందని నిపుణులు అంచనా వేశారు. 2025లో మొదటి అట్లాంటిక్ హరికేన్ అయిన ఎరిన్, శనివారం ఉదయం చివరి నాటికి ఉష్ణమండల తుఫాను నుండి కేటగిరీ-5 హరికేన్‌గా మారింది.ఇది గంటకు బలపడుతూ.. 255 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులకు కారణమైంది. 24 గంటల్లో కనీసం 35 మైల్స్ పర్ అవర్ వేగంతో వచ్చే తుఫాన్‌ను భారీ తుఫాన్‌గా భావిస్తామని, ఎరీన్ అంతకు నాలుగురెట్లకు బలమైనదని నిపుణులు తెలిపారు. సెప్టెంబర్-అక్టోబర్‌ నెలలలో వచ్చే తుఫానులు బలపడటం సాధారణ పరిణామమేనని, కానీ, ఇంతగా బలపడటాన్ని.. వాతావరణ సంక్షోభంగానే చూడాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు అట్లాంటిక్‌లో 43 కేటగిరీ-5 తుఫానులు వచ్చాయని, వాటిలో 2016 తర్వాత 11 తుఫానులు వచ్చాయని నిపుణులు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఎరీన్ బలహీన పడి కేటగిరి 3 స్థాయికి చేరటంతో నిపుణులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 80 కోట్ల ఆస్తి .. చివరి చూపుకు రాని పిల్లలు

మటన్ సూప్.. అదిరిపోద్ది.. హీరో ఎవరంటే

పవిత్ర స్థలంలో అలాంటి పనులేంటి ?? వివాదంలో జాన్వీ, సిద్ధార్థ్‌

170 కోట్లు ఏంటి సామి..! కలెక్షన్స్‌ సునామీ అంటే ఇదీ..

Samantha: అమ్మాయిలు అలర్ట్! తన స్కిన్‌ కేర్‌ సీక్రెట్ బయటపెట్టిన సామ్