AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 80 కోట్ల ఆస్తి .. చివరి చూపుకు రాని పిల్లలు

రూ. 80 కోట్ల ఆస్తి .. చివరి చూపుకు రాని పిల్లలు

Phani CH
|

Updated on: Aug 17, 2025 | 2:53 PM

Share

నాటి సూపర్ హిట్ మూవీ బడి పంతులు నుంచి నేటి అనేక కుటుంబ కథా సినిమాలు తల్లిదండ్రుల నుంచి ఆస్తిని తీసుకుని వారిని అనాధలా వదిలేసిన పిల్లల గురించే.. అలాంటి సినిమా కథకు సజీవ రూపంగా నిలుస్తుంది ఓ ప్రముఖ రచయిత జీవితం. ఆధ్యాత్మిక నగరం వారణాసిలో ఓ తండ్రి నుంచి కొడుకు, కూతురు ఆస్తిని లాక్కుని .. తండ్రిని అనాధలా వదిలేశారు.

చివరకు మరణించిన తర్వాత కూడా జన్మనిచ్చిన తండ్రిని చివరి చూపు చూడ్డానికి కూడా రాలేదు. ఆధ్యాత్మికవేత్త, సాహితీవేత్త శ్రీనాథ్ ఖండేల్‌వాల్ 80 కోట్ల రూపాయల ఆస్తిపరుడు. అయినప్పటికీ అతను వృద్ధాశ్రమంలో ఉండేవారు. ఐదేళ్ల పాటు అక్కడే ఉంటూ 2024 డిసెంబర్‌ 28న తన 80వ ఏట మరణించారు. కన్నుమూసిన ఆయన చివరి చూపు చూడటానికి కానీ, అంత్యక్రియలకు కానీ ఆయన కుటుంబ సభ్యులు కాని, పిల్లలు కాని ఎవరూ రాలేదు. శ్రీనాథ్ ఖండేల్‌వాల్ మత్స్యపురాణం మొదలుకుని నాలుగు వందలకు పైగా పుస్తకాలు రాయగా అందుకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది .అయితే ఆయన పురస్కారాన్ని తీసుకోవడానికి తిరస్కరించారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండగా.. ఒక కొడుకు వ్యాపారవేత్త, కూతురు సుప్రీంకోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆప్తులు ఉన్నా, ఎంత ఆస్థి ఉన్నా, కన్న తండ్రి పట్ల ఏ ఒక్కరు తమ బాధ్యత నిర్వర్తించలేదు. చివరికి స్థానికులే తలా కొంచెం చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం అనేది మనుషుల్లో, ఆఖరికి కడుపున పుట్టిన సొంత పిల్లల్లో కూడా కనుమరుగైపోతుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మటన్ సూప్.. అదిరిపోద్ది.. హీరో ఎవరంటే

పవిత్ర స్థలంలో అలాంటి పనులేంటి ?? వివాదంలో జాన్వీ, సిద్ధార్థ్‌

170 కోట్లు ఏంటి సామి..! కలెక్షన్స్‌ సునామీ అంటే ఇదీ..

Samantha: అమ్మాయిలు అలర్ట్! తన స్కిన్‌ కేర్‌ సీక్రెట్ బయటపెట్టిన సామ్

‘కడుపు మంటతో.. నిజం చెప్పి..’ టీవీ షోలపై ఉదయభాను సంచలన కామెంట్స్