AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు..పొలం చదును చేస్తుండగా బయటపడిన బకెట్.. అందులో…

రైతు..పొలం చదును చేస్తుండగా బయటపడిన బకెట్.. అందులో…

Samatha J
|

Updated on: Aug 16, 2025 | 9:35 PM

Share

పొలం దున్నుతున్నప్పుడు భూమిలో వజ్రాలు దొరకడం.. విగ్రహాలు బయటపడటం.. లేదా పురాతన నిధి దొరకడం మనం చాలా చూశాం. తాజాగా అనంతపురం జిల్లాలో పొలం చదును చేస్తున్న ఓ రైతుకు ఒక పెద్ద బకెట్‌ దొరికింది. అందులో ఏముందా అని చూసిన రైతు దెబ్బకు హడలెత్తిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.

అది అనంతపురం జిల్లా వేపచర్ల అటవీ ప్రాంతం. అక్కడ ఓ అనువైన స్థలంలో టమాట సాగు చేసేందుకు ఒక రైతు భూమిని చదును చేస్తుండగా…ఓ బకెట్ బయటపడింది. అందులో ఏముందో చూసి రైతు గందరగోళానికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. అది మావోయిస్టు డంప్‌గా గుర్తించారు. అక్కడి నుంచి భారీగా డిటోనేటర్లు, తుపాకీ బుల్లెట్లు, ఐరన్ బాల్స్, మావోయిస్టుల డ్రెస్‌తో ఉన్న ఫోటోలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం వేపచర్ల ప్రాంతంలో మావోయిస్టులు ఉనికి ఉండేది. ఆ కాలంలో ఈ అటవీ ప్రాంతాన్ని మావోయిస్టుల రహస్య సమావేశాలు, వారి ఆయుధాలు, సామాగ్రి డంపింగ్ కేంద్రాలుగా ఉపయోగించేవారట. ఎందుకైనా మంచిదని పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో తాజాగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. పక్క గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి, ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఐశ్వర్యారాయ్‌ 17 ఏళ్లుగా రాఖీ కడుతున్న ఆ స్టార్‌ యాక్టర్‌ ఎవరో తెలుసా?

కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో వరుడు జంప్ వీడియో

సింహానికి ఎదురెళ్లిన మనిషి.. చివరికి.. వీడియో

ఆ సమయంలో మహిళలకు ఎందుకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందో తెలుసా?