పాడుబడ్డ ఇంటిని పరిశీలించిన మహిళ.. ఎదురుగా కనిపించింది చూసి షాక్
ఓ మహిళ పాడుబడిన ఇంటిని పరిశీలిస్తుండగా.. భయానక సీన్ కనిపించింది. దాన్ని చూసి ఆమె దెబ్బకు షాక్ అయ్యింది. ఏప్రిల్ వెర్టుచి అనే మహిళ.. ఐదు సంవత్సరాల క్రితం మూసివేసిన స్వాన్సన్ ఫ్యూనరల్ హోమ్‌ను పరిశీలించడానికి వెళ్ళింది. శిథిలావస్థలో ఉన్న ఆ పాడుబడ్డ ఇంటిని పర్యాటకులకు అనువైన చోటుగా మార్చారు స్థానిక అధికారులు. అయితే ఏప్రిల్ అక్కడికి చేరుకోగానే.. ఆమెతో పాటు తన ఇద్దరు స్నేహితులు ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కనుగొన్నారు.
41 ఏళ్ల ఆ మహిళ, ఆమె స్నేహితులు.. ఆ ఇంటి బేస్‌మెంట్‌లోకి దిగగానే అక్కడ కనిపించింది చూసి షాక్‌తో కేకలు వేశారు. ఆ సమయంలో వారికి కనిపించింది ఏంటన్నదే అసలు ట్విస్ట్. కొన్నేళ్ల కిందట ఆ పాడుబడిన ఇంటిలో ఓ సంఘటన చోటు చేసుకుంది. పడిపోయిన కాస్కెట్ లిఫ్ట్ కింద నలిగిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని వారు కనుగొన్నారు. అక్కడ ఆ మృతదేహం మొండెం పైభాగం మాత్రమే కనిపించింది. అతడి మొబైల్ ఫోన్ ఆ మృతదేహం చేతికి అందనంత దూరంలో ఉంది. అది చూడగానే వాళ్లు ముగ్గురు ఆ పాడుబడ్డ ఇంటిని 30 నిమిషాల్లోనే విడిచి వెళ్లిపోయారు. ఈ ఘటన మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో చోటు చేసుకుంది. ఆ ముగ్గురూ వెంటనే 911కి కాల్ చేసి అధికారులను పిలిచారు. పోలీసులు, అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా.. అసలేం జరిగిందో వారు వివరించారు. ఆ వ్యక్తి భవనం నుంచి కొంత స్క్రాప్ మెటల్‌ను బయటకు తీసే క్రమంలో చనిపోయాడని పోలీసులు తెలిపారు. కాస్కెట్ లిఫ్ట్‌ను విడదీసే క్రమంలో.. అది కూలిపోయి అతడు నుజ్జునుజ్జయ్యాడని వివరించారు. కాగా, సదరు మహిళ 2022లో పాడుబడ్డ ఇంటిని సందర్శించగా.. దానికి సంబంధించిన వీడియో మళ్లీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
ఐశ్వర్యారాయ్ 17 ఏళ్లుగా రాఖీ కడుతున్న ఆ స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో వరుడు జంప్ వీడియో
సింహానికి ఎదురెళ్లిన మనిషి.. చివరికి.. వీడియో
ఆ సమయంలో మహిళలకు ఎందుకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందో తెలుసా?
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

