మటన్ సూప్.. అదిరిపోద్ది.. హీరో ఎవరంటే
ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లోనూ అదరగొడుతున్నాయి. దీంతో మేకర్స్ ఈ జానర్లో సినిమా చేయడం షురూ చేశారు. ఈక్రమంలోనే టాలీవుడ్ నుంచి వస్తోన్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మటన్ సూప్. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ స్టార్ ప్రొడ్యూసర్ చేతుల మీదగా రిలీజ్ అయింది.
రామకృష్ణ వట్టికూటి సమర్పణలో.. అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ అనేది ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా, అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలుగా డెబ్యూ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్.. స్టార్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు చేతుల మీదుగా రిలీజ్ అయింది. మటన్ సూప్ ఫస్ట్ పోస్టర్ ను ఆవిష్కరించిన రవి కూమార్.. టైటిల్ పోస్టర్ బాగుందంటూ కితాబిచ్చారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరకున్నారు. ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన లెజెండరీ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావుకు ఈ చిత్ర నిర్మాత మల్లిఖార్జున ఎలికా ధన్యవాదాలు చెప్పారు. మా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు వస్తాం అన్నారు. మంచి చిత్రం రాబోతోందని.. తప్పకుండా మీకు మా కంటెంట్ నచ్చుతుంది అంటూ చెప్పారు ఈయన. తన ఫ్రెండ్ రామచంద్ర మంచి కథతో ‘మటన్ సూప్’ తెరకెక్కిస్తున్నట్టు చెప్పిన ఈ మూవీ హీరో రమణ .. తమ సినిమా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ అద్భుతంగా వచ్చిందని చెప్పాడు. తమ కోసం వచ్చి సపోర్ట్ చేసిన నిర్మాత కె.ఎస్.రామారావుకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. సినిమా అద్భుతంగా వస్తోందని… పగలు రాత్రి అనే తేడా లేకుండా తామంతా కష్టపడుతున్నామంటూ చెప్పాడు. చిత్ర దర్శకుడు రామచంద్ర వట్టికూటి కూడా తమ కంటెంట్ పై కాన్పిడెన్స్ వ్యక్తం చేశారు. తమ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ పోస్టర్ను రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ కేఎస్ రవికుమార్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. తమ సినిమా అదిరిపోతుందని.. వెయిట్ ఫర్ అవర్ కంటెంట్ అంటూ చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవిత్ర స్థలంలో అలాంటి పనులేంటి ?? వివాదంలో జాన్వీ, సిద్ధార్థ్
170 కోట్లు ఏంటి సామి..! కలెక్షన్స్ సునామీ అంటే ఇదీ..
Samantha: అమ్మాయిలు అలర్ట్! తన స్కిన్ కేర్ సీక్రెట్ బయటపెట్టిన సామ్
‘కడుపు మంటతో.. నిజం చెప్పి..’ టీవీ షోలపై ఉదయభాను సంచలన కామెంట్స్
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో

