AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

170 కోట్లు ఏంటి సామి..! కలెక్షన్స్‌ సునామీ అంటే ఇదీ..

170 కోట్లు ఏంటి సామి..! కలెక్షన్స్‌ సునామీ అంటే ఇదీ..

Phani CH
|

Updated on: Aug 17, 2025 | 2:27 PM

Share

రెమ్యునరేషన్‌ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా... ఇండియాలోనే ఎవ్వరూ తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకునే రజినీ కాంత్.. తన మూవీ కలెక్షన్స్‌తోనూ ఏ స్టార్ తీసుకురానన్ని కలెక్షన్స్‌ను సాధిస్తుంటాడు. ఇప్పుడు కూలీ సినిమాతోనూ అదే చేశారు. తన రీసెంట్‌ మూవీ కూలీకి.. తన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

అందర్నీ అవాక్కయ్కేలా చేస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కూలీ. జైలర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజినీ నటించిన సినిమా కావడంతో విడుదలకు ముందే కూలీ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషించడంతో ఈ మూవీపై మరింత హైప్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు ఫ్యాన్స్. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో నిర్మించి ఈ మూవీ ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమాకు మొదటి రోజే కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది. ట్రేడ్ నివేదికల ప్రకారం కూలీ సినిమాకు మొదటి రోజే రూ.170 కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో తొలి రోజే రూ.65 కోట్లు కలెక్షన్స్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడు చిత్రాలలో రెండింటిని కూలీ అధిగమించింది. మొదటి సినిమా ఖైదీ తొలి రోజున రూ.6.4 కోట్లు వసూలు చేయగా.. కమల్ హాసన్ నటించిన విక్రమ్ ఫస్ట్ డే రూ.37.5 తో కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు రజినీ నటించిన కూలీ చిత్రం మొదటి రోజే రూ.65 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. గతంలో లోకేష్ దర్శకత్వంలో విజయ్, త్రిష నటించిన లియో సినిమా మొదటి రోజే రూ.76.2 కోట్లు వసూలు చేసి.. మొత్తానికి రూ.341 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: అమ్మాయిలు అలర్ట్! తన స్కిన్‌ కేర్‌ సీక్రెట్ బయటపెట్టిన సామ్

‘కడుపు మంటతో.. నిజం చెప్పి..’ టీవీ షోలపై ఉదయభాను సంచలన కామెంట్స్

రజినీకి ముగ్దుడైన పీఎం సాబ్‌.. శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్

స్టార్ హీరో కొడుకు కోసం.. ముగ్గురు హీరోయిన్లు?

కూలీ సక్సెస్ ఎఫెక్ట్.. కోట్లు విలువ చేసే కారుకొన్న హీరో..