స్టార్ హీరో కొడుకు కోసం.. ముగ్గురు హీరోయిన్లు?
ఇప్పుడో స్టార్ హీరో వారసుడు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టాలంటే అంత ఆశామాషీ కాదు.. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ మధ్యలో.. మరెన్నో లెక్కల మధ్యలో ఆ వారసుడు తనని తాను ఫ్రూప్ చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఫెయిల్ అయినా.. లేచి నిలబడాలి. మరో ప్రయత్నంతో ముందుకు సాగాలి. ఎట్ ప్రజెంట్ ఇదే పని చేస్తున్నాడు స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్. అయితే ఈ సారి ఏకంగా ఓ బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ పై కన్నేశాడు.
దాంతో పాటే ఈ హీరోకు సపోర్ట్‌గా ముగ్గురు హీరోయిన్లతో బరిలోకి దిగుతున్నారని న్యూస్. హిందీలో గతేడాది హిట్ అయిన ‘కిల్’ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మ దీన్ని తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్ కోసం ధ్రువ్ విక్రమ్ హీరోగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులోనే ధ్రువ్‌కి జంటగా కాయదు లోహార్, అనుపమ పరమేశ్వరన్, కేతిక శర్మని తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఒరిజినల్ హిందీ వెర్షన్‌లో ఒక హీరోయినే ఉంటుంది. కానీ తమిళం, తెలుగు భాషల్లోకి వచ్చేసరికి ‘కిల్’ చిత్ర కథలో మార్పులు చేసి ముగ్గురు హీరోయిన్లని ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇక తమిళ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. అయినా సరే ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘బైసన్’ అనే మూవీ చేస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రం చివరిదశకు చేరుకుంది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీలో ధ్రువ్‌కి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూలీ సక్సెస్ ఎఫెక్ట్.. కోట్లు విలువ చేసే కారుకొన్న హీరో..
‘కింగ్ అయినా.. అనుబంధాలకు బానిసే!’ షోలో కన్నిళ్లు పెట్టుకున్న నాగ్..
‘ప్రేమ కథల్లో ఈ ప్రేమ కథ వేరయా..’ ఆకట్టుకుంటున్న ఒక పార్వతి.. ఇద్దరు దేవదాసులు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

