84 కోట్లు పెట్టి.. లగ్జరీ విల్లాను దక్కించుకున్న హీరోయిన్
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. తక్కువ సమయంలోనే హిట్ చిత్రాల్లో నటించిన ఈమె.. ఇటీవలే లగ్జగీ లావిష్ పెంట్ హౌస్ కొనుగోలు చేసినట్లు బీ టౌన్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో సోషల్ మీడియాల మొత్తం ఈ బ్యూటీ ఇంటి గురించే మాట్లాడుకుంటోంది. మిమి సినిమాకుగానూ ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డ్ అందుకుంది హీరోయిన్ కృతి సనన్.
ఈ ఒక్క సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. దీంతో హిందీ సినిమా ప్రపంచంలోని స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరిగా నిలిచింది. రెమ్యునరేషన్ పరంగా కూడా వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్‌గా ట్యాగ్ వచ్చేలా చేసింది. ఈక్రమంలోనే ఈ బ్యూటీ ముంబైలోని నాగరిక పాలి హిల్ ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఓ డ్యూప్లెక్స్ పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ న్యూస్. ఇక అకార్డింగ్ టూ బాలీవుడ్ మీడియా రిపోర్ట్.. కృతి సనన్ కొనుగోలు చేసిన రెసిడెన్షియల్ టవర్‌లోని ఈ లగ్జరీ పెంట్‌హౌస్ ధర దాదాపు 78.20 కోట్లు అని తెలుస్తోంది. అంతేకాదు కృతి కొత్త ఇల్లు 14వ , 15వ అంతస్తులలో .. 6,636 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉందట. 1,209 చదరపు అడుగుల టెర్రస్ కూడా అదనంగా ఉందట. చదరపు అడుగు ధర దాదాపు 1.18 లక్షలు చొప్పున ఈ విల్లాను ఈ బ్యూటీ కొనుగోలు చేసిందట. ఈ డీల్ కోసం కృతి సనన్ రూ.3.91 కోట్ల స్టాంప్ డ్యూటీ, GST, ఇతర ఛార్జీలతో సహా మొత్తం రూ.84.16 కోట్లకు పైగా చెల్లించిందని న్యూస్. కృతి సనన్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2023లో అలీబాగ్‌లో 2,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేసింది. అమితాబ్ బచ్చన్ కూడా ఇక్కడ ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. మీడియా నివేదికల ప్రకారం కృతి 2024లో బాంద్రా వెస్ట్‌లో 4-BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది, దీని విలువ రూ. 35 కోట్లు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కృతి సనన్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ధనుష్ తో కలిసి ‘తేరే ఇష్క్ మే’ సినిమాలో నటిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లైన ఆరు నెలల తర్వాత.. సడెన్ షాకిచ్చిన టాలీవుడ్ హీరో…
అంతా నా కర్మ…! అందుకే నాకు ఇన్ని బాధలు.. అమర్ దీప్ ఎమోషనల్!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

