అంతా నా కర్మ…! అందుకే నాకు ఇన్ని బాధలు.. అమర్ దీప్ ఎమోషనల్!
చాలా మంది దేవుడిని నమ్మకపోవచ్చు కానీ కర్మ సిద్ధాంతాన్ని మాత్రం బలంగా నమ్ముతారు. తమ కర్మ ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తున్నామని చెబుతుంటారు. ఇప్పుడు బుల్లి తెర స్టార్ అమర్ దీప్ కూడా ఇదే అంటున్నాడు. అనడమే కాదు కర్మ గురించి చెబుతూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు కూడా...! బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అమర్ దీప్ కూడా ఒకడు.
అంతుకు ముందు ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే అంతకు ముందే అమర్ దీప్.. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. నాగచైతన్య శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో కూడా యాక్ట్ చేశాడట. మురళీ శర్మ కాంబోలో కొన్ని సీన్లలో నటించాడట. ఇందుకు డబ్బింగ్ కూడా చెప్పాడట. టైటిల్ రోల్స్ లో పేరు కూడా ఉందట. కానీ చివరాఖరికి సినిమాలో ఇతని సీన్సే లేవట. ఎడిటింగ్ లో అన్నీ లేపేశారట. ఇదే కాదు జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మొగాడివోయ్, కృష్ణార్జున యుద్ధం ఇలా ఎన్నో సినిమాల్లో నటించినా ఎడిటింగ్ లో తీసేశారట. దీంతో చాలా బాధపడ్డానంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో. అయితే ఎట్టకేలకు ఇప్పుడు మెయిన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉందంటున్నాడు అమర్ దీప్. ప్రస్తుతం చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమర్.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఒకప్పుడు తన మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదని.. ఎక్కువగా ఆలోచించే వాడినని.. రోజూ సరిగ్గా నిద్ర పట్టేది కాదన్నాడు. నిద్ర కోసం స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వాడానంటూ చెప్పాడు. యాంగ్జైటీ టాబ్లెట్స్ కూడా తీసుకున్నా అన్నాడు. ఇప్పుడు వాటిని అధిగమించాలని చాలా ట్రై చేస్తున్నానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని.. గత జన్మలో కానీ.. ఈ జన్మలో కానీ తాను కొంతమందిని బాధపెట్టి ఉండొచ్చని,.. అది ఇప్పుడు తనకే రివర్స్ తాకుతోంది అంటూ ఎమోషనల్ అయ్యాడు అమర్. ఒకానొక సమయంలో తాను సూసైడ్ కూడా ట్రై చేశానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం అమర్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉట్టి కొట్టడం ప్రాక్టీస్ చేస్తూ.. జారి పడి బాలుడు మృతి
కూలీ రిలీజ్.. సెలవుతో పాటు ఫ్రీగా టికెట్స్ ఇచ్చిన సంస్థ.. ఎంప్లాయిస్ ఫుల్ హ్యాపీ
Coolie: కూలీ’ చిత్రానికి వారికి నో ఎంట్రీ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

