Coolie: కూలీ’ చిత్రానికి వారికి నో ఎంట్రీ
దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆగస్టు 14 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు యంగ్‌టైగర్ ఎన్టీఆర్-హృతిక్‌రోషన్, సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాలు దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. బుకింగ్స్ లోనూ ఈ సినిమాలు పోటీపడుతున్నాయి.
రెండు సినిమాలకు భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక కూలీ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో తెలుగులో ఉన్న పలు థియేటర్ల యాజమాన్యం థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకి పలు సూచనలు జారీ చేసింది. ఈ సినిమాకు 18 ఏళ్ల లోపు వయసు ఉన్నవారికి అనుమతిలేదని ప్రకటించింది. అంతేకాదు వయస్సును నిరూపించే ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు
వాటర్ ప్లీజ్..! కాళ్ల బేరానికొచ్చిన పాక్
ఎట్టకేలకు అసలు బడ్జెట్ ఎంతో బయటపెట్టిన మహావతార్ నరసింహ డైరెక్టర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

