మహేష్‌తో నటించేందుకు నో చెప్పిన.. మెగా హీరో
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘మహర్షి’ ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇదే మూవీలో మహేశ్ స్నేహితుడు రవిగా ఓ కీలకమైన పాత్రలో నటించాడు అల్లరి నరేష్. అప్పటివరకు కామెడీ సినిమాలకే పరిమితమైన అల్లరి నరేష్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించాడు.
స్నేహం అలాగే తనను నమ్ముకున్న వాళ్ల కోసం తన కెరీర్‌ని కూడా త్యాగం చేసే పాత్రలో అద్భుతంగా నటించాడు నరేష్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించాడు. అలా మహర్షి విజయంలో అల్లరోడి పాత్ర కూడా హైలెట్‌గా నిలిచింది. అయితే ఈ క్యారెక్టర్ కోసం మొదట మెగా హీరో సాయి ధరమ్ తేజును ఎంచుకున్నాడ డైరెక్టర్ వంశీ. ఇప్పుడు ఇదే విషయం బయటికి వచ్చి నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అల్లరోడి కెరీర్‌ని మహర్షి సినిమా మలుపు తిప్పిన మహర్షి సినిమాలో అల్లరోడు పోషించిన పాత్ర ముందుగా ఓ మెగా హీరో వద్దకు వెళ్లిందట. అయితే అతను రిజెక్ట్ చేయడంతో అల్లరి నరేశ్ దగ్గరకు వచ్చిందట. ఇంతకీ రవి పాత్రను రిజెక్ట్ చేసిన ఆ మెగా హీరో మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్. మహర్షి టైంలో సాయి ధరమ్ తేజ్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అలాంటి టైంలో మహర్షిలో రవి పాత్ర చేస్తే తేజ్‌కు మంచి బూస్టింగ్ వస్తుందని వంశీ పైడిపల్లి అనుకున్నాడట. అనుకున్నట్లు గానే సుప్రీం హీరోను సంప్రదించారట. అయితే కొన్ని కారణాల వల్ల సాయి ధరమ్ తేజ్‌ను ఈ పాత్రను వద్దనుకున్నారట. ఆ తర్వాత లైన్‌లోకి అల్లరి నరేశ్ వచ్చాడు. 2019లో విడుదలైన మహర్షి సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లరి నరేష్ ఆల్కహాల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అటు తేజ్ కూడా సంబరాల ఏటి గట్టు అనే సినిమాలో నటిస్తున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
300 కోట్ల దిశగా.. మహావతార్ నరసింహ మూవీ
కొత్త షో స్టార్ట్ చేసిన జగపతి బాబు! రిబ్బన్ కట్ నాగార్జునతోనే…
విధి ఆడిన వింత నాటకంలో.. పాపం! చాలా కామెడీగా బలయ్యాడుగా..
ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సైయారా OTT డేట్స్ ఫిక్స్
Upasana Konidela: ‘నా భర్త కౌంట్ 199 ‘ చరణ్ సీక్రెట్ బయటపెట్టిన ఉపాసన
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

