విధి ఆడిన వింత నాటకంలో.. పాపం! చాలా కామెడీగా బలయ్యాడుగా..
మనం ఏది కోరుకున్నా.. మనము ఏది పొందిగా..! అది విధి లిఖితమే అంటారు! మన నుదిటి మీద రాసుంటే మన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతాయి. మన దగ్గరకు వచ్చేవి వస్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇదే విధి.. సత్య దేవ్ కు ఓ సినిమాను మిస్ అయ్యేలా చేసిందని కొందరు నెటిజన్లు అంటున్నారు.
చాలా కామెడీగా విడి ఆడిన వింత నాటకంలో బలయ్యాడంటూ… ఈ హీరోకి సంబంధించిక ఓ సంఘటనను సోషల్ మీడియాలో ఉదహరిస్తూ పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా సినీరంగంలో ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా మరొకరి చేతుల్లోకి వెళ్లిపోతుంది. కొన్నిసార్లు ఒకరి ఖాతాలో పడాల్సిన హిట్టు మరొకరి ఖాతాల్లో పడుతుంది. ఒక హీరోను ఊహించుకుని రాసిన కథ.. చివరకు మరొకరితో చేతిలోకెళ్లి వాలుతుంది. తాజాగా హీరో సత్యదేవ్ కూడా తాను ఓ సూపర్ హిట్ మూవీని మిస్సయ్యానంటూ అరేబియన్ కడలి ప్రమోషనల్ మీట్‌లో రివీల్ చేశాడు. అది కూడా చాలా కామెడీగా, అవాక్కయేలా జరిగిందంటూ చెప్పుకొచ్చాడు. హిట్ సినిమా ఫ్రాంచైజ్ డైరెక్టర్ శైలేష్… మొదట హిట్ 1 సినిమా కోసం తననే హీరోగా ఎంపిక చేసుకున్నాడని సత్యదేవ్ చెప్పారు. తనకు ఓ రాత్రి కాల్ చేసి.. నెక్ట్స్ డే స్టోరీ నరేషన్‌కు వస్తున్నా అంటూ చెప్పాడని కూడా గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ తర్వాతే శైలేష్ తాను పోలీస్ క్యారెక్టర్ చేసిన ఓ సినిమా తాళూకు టీజర్ యూట్యూబ్‌లో చూశాడని.. ఆ వెంటనే తన నిర్ణయం మార్చుకున్నాడని సత్య దేవ్ చెప్పాడు. బ్యాక్ బ్యాక్ పోలీస్ క్యారెక్టర్ సినిమా పడితే.. తన హిట్ సినిమాల్లోని పోలీస్ ఇంపాక్ట్ జనాల్లో తగ్గిపోతుందని శైలేజ్ ఫీలయ్యాడని.. అదే రీజన్ తనకూ చెప్పాడని సత్య దేవ్ వివరించాడు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ విశ్వక్ చేతుల్లోకి వెళ్లిందని.. ఆసినిమా సూపర్ డూపర్ హిట్టైందని చెబుతూనే… తాను పోలీస్ క్యారెక్టర్ చేసిన సినిమా.. శైలేష్ చూసి తన మనసు మార్చుకున్న సినిమా… రిలీజ్ కాకుండా ఆగిపోయిందని చెప్పి అందరికీ షాకిచ్చాడు. వాటే ట్విస్ట్ అని కామెంట్ వచ్చేలా చేసుకుంటూనే.. ఇది విధి ఆడిన వింత నాటకం బ్రో అనే కామెంట్‌ను వచ్చేలా చేసుకుంటున్నాడు ఈ హీరో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సైయారా OTT డేట్స్ ఫిక్స్
Upasana Konidela: ‘నా భర్త కౌంట్ 199 ‘ చరణ్ సీక్రెట్ బయటపెట్టిన ఉపాసన
జాలరి పంట పండిందిగా.. వలలో చిక్కింది చూసి షాక్
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

