AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక ఫోటోలన్నీ

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక ఫోటోలన్నీ

Phani CH
|

Updated on: Aug 14, 2025 | 12:29 PM

Share

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇకపై యూజర్లు తమ స్టేటస్‌లో ఒకేసారి పలు ఫొటోలను కలిపి కొలేజ్‌గా పెట్టుకోవచ్చు. ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, వాట్సాప్‌లోనే ఈ సౌలభ్యాన్ని కల్పించడం విశేషం.

ఈ కొత్త అప్‌డేట్‌తో స్టేటస్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా వాట్సాప్ అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు వాట్సాప్ స్టేటస్‌లో ఓ నాలుగైదు ఫొటోలను ఒకేసారి పెట్టాలంటే, ఇతర ఎడిటింగ్ యాప్‌లను ఉపయోగించి ముందుగా కొలేజ్ తయారు చేసుకోవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తొలగిస్తూ వాట్సాప్ ఇప్పుడు బిల్ట్-ఇన్ అనే కొలేజ్ ఎడిటర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు గరిష్ఠంగా ఆరు ఫొటోలను ఎంచుకొని, తమకు నచ్చిన విధంగా ఒకే ఫ్రేమ్‌లో అమర్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. యూజర్లు స్టేటస్ అప్‌డేట్ చేయడానికి ఫొటోలను ఎంచుకున్నప్పుడు, స్క్రీన్‌పై కొత్తగా ‘లేఅవుట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, గ్యాలరీ నుంచి కావలసిన ఫొటోలను ఎంపిక చేసుకొని విభిన్నమైన లేఅవుట్లలో కొలేజ్‌ను సృష్టించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరు వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ దశలవారీగా విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఇటీవల వాట్సాప్ తమ స్టేటస్‌లో మ్యూజిక్ జోడించే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ కొలేజ్ ఫీచర్‌ను తీసుకురావడం గమనార్హం. వీటితో పాటు భవిష్యత్తులో మ్యూజిక్ స్టిక్కర్లు, ఫొటో స్టిక్కర్లు వంటి మరిన్ని ఆకర్షణీయమైన సదుపాయాలను కూడా అందించేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన మార్పులతో వాట్సాప్ స్టేటస్ విభాగం మరింత క్రియేటివ్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా మారనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేరుశనగ గొంతులో ఇరుక్కొని మృతి.. శోకసంద్రంలో కుటుంబం