వేరుశనగ గొంతులో ఇరుక్కొని మృతి.. శోకసంద్రంలో కుటుంబం
శ్రావణ శుక్రవారం.. అందులోనూ వరమహాలక్ష్మి వ్రతం కావడంతో ఆ ఇంటిల్లిపాదీ పండగ హడావిడిలో ఉన్నారు. అమ్మవారి పూజకోసం అన్నీ సిద్ధం చేసుకొని, పిండివంటలు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. మరికాసేపట్లో వరలక్ష్మి వ్రతం ప్రారంభించాల్సి ఉంది.. ఇంతలోనే ఊహించని ఆ కుటుంబం విషాద సంఘటన జరిగిపోయింది.
వెరుశెనగ గింజ గొంతులో ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి చెందడంతో ఆ ఇంట విషాదం నిండిపోయింది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో చోటుచేసుకుంది. పెనుకొండ నగరపంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన నాగరాజు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం వరమహాలక్ష్మి పండగను పురస్కరించుకుని ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన చిన్నకుమారుడు రెండేళ్ల దీపక్ అలియాస్ బిట్టు వేయించిన వేరుసెనగ గింజలను నోట్లో వేసుకున్నాడు. దీంతో అవి గొంతులో ఇరుక్కుపోయి అవి మింగలేక బిట్టు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. క్షణాల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో కుటుంబసభ్యులు బిట్టును హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బిట్టును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పండగ వేళ కుమారుడి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇదేం పని ?? మీరు మారారా ??
దయగా ఉంటే చాలు దెయ్యాలను పూజించినా డోంట్ కేర్.. ఆకట్టుకుంటున్న టూలెట్ ప్రకటన
అమ్మ బాబోయ్.. 4.5 km పొడవైన రైలును చూసారా?
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

